వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ వైపు వేలు చూపొద్దు: మోడీ వార్నింగ్, ‘అవినీతి లేని భారత్’

సైన్యాన్ని ప్రశ్నిస్తూ.. వారి వైపు వేలు చూపొద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా హెచ్ఛరించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సైన్యాన్ని ప్రశ్నిస్తూ.. వారి వైపు వేలు చూపొద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా హెచ్ఛరించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆర్మీ మోహరించడంపై టీఎంసీ, ఇతర విపక్ష పార్టీలు పార్లమెంటులో ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. సీనియర్ మంత్రులతో శుక్రవారం సమావేశమైన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్మీని ప్రశ్నించడం తప్పుడు పనేనని మోడీ స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. భారత సైన్యం వైపు వేలు చూపొద్దంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు. కాగా, తమ అనుమతి లేకుండానే రాష్ట్రంలో సైనికులు మోహరించారని మమత బెనర్జీ వాదించగా.. ఆర్మీ మోహరింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జారీ చేసిన పత్రాలను ఆర్మీ ఉన్నతాధికారులు చూపించడం గమనార్హం.

అవినీతి లేని భారత్

భారీ ఎత్తున పోగుపడే నగదు అవినీతికి, నల్లధనానికి పెద్ద మూలమని ప్రధాని మోడీ అన్నారు. అవినీతి లేని భారత్‌కు బలమైన పునాదులు వేసేందుకు నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలు మార్పునకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లింక్డిన్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన వ్యాసంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

'యువత మార్పునకు చొరవ తీసుకోవడంతో పాటు అందరూ నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లేలా స్ఫూర్తిని కలిగించాలి. అవినీతికి, నల్లధనానికి చోటు లేని భారత్‌కు ఈ మార్పు గట్టి పునాదులను వేస్తుంది. మొబైల్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ వ్యాలెట్ల రోజులివి. ఆహారం తెప్పించుకోవడం, గృహోపకరణాలు కొనడం-అమ్మడం, ట్యాక్సీ బుక్‌ చేసుకోవడం సహా ఇంకా చాలా విషయాలు మొబైల్‌ ఫోన్ల ద్వారా సాధ్యమే. సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లో వేగాన్ని, సౌకర్యాన్ని తీసుకొచ్చింది' అని తెలిపారు.

Don't point fingers at the army- PM hands out a stern warning

అంతేగాక, 'భారత ఆర్థికవ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించే చిన్న వ్యాపారులకు పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విశిష్ట అవకాశాన్ని కల్పిస్తోంది. నేటి మార్పులకు అనుగుణంగా మారి, మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునే చరిత్రాత్మక అవకాశం ఇప్పుడు మన వ్యాపార వర్గానికి వచ్చింది. ఈ అవకాశం మరింత సౌభాగ్యాన్ని తీసుకొస్తుంది' అని వివరించారు.

'ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారని నవంబరు 8న నేను పెద్ద నోట్ల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు నాకు తెలుసు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక కష్టాలను భరించాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. దేశానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక కష్టాలను ప్రజలు భరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది' అని
సామాన్య ప్రజల అసౌకర్యం గురించి ఆయన ప్రస్తావిస్తూ చెప్పారు.

'కొద్ది రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, కర్ణాటక, గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం కలిగింది. అవినీతి, నల్లధనాన్ని నిర్మూలించాలా? పేదలు, నయా మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు వారికి కావాల్సింది దక్కాలా? అని వెళ్లిన ప్రతి చోటా అడిగాను. అందుకు ఔను అనే సమాధానమే వచ్చింది' అని ప్రధాని మోడీ చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi said that none should question or raise their fingers against the Indian army. He made this statement while addressing senior ministers during a meet he had chaired this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X