'మేమే బహిష్కరిస్తాం, పోయెస్ నుంచి శశికళను తరిమేసేందుకు రెండ్రోజుల్లో వెళ్తున్నాం'
తనను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు చిన్నమ్మ శశికళ ప్రకటించడంపై మధుసూదనన్ శుక్రవారం నాడు స్పందించారు. శశికళ పైన తీవ్రంగా మండిపడ్డారు.
చెన్నై: తనను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు చిన్నమ్మ శశికళ ప్రకటించడంపై మధుసూదనన్ శుక్రవారం నాడు స్పందించారు. శశికళ పైన తీవ్రంగా మండిపడ్డారు.
తమ పైన చర్యలు తీసుకునే అధికారం శశికళకు ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. అసలు తామే శశికళను బహిష్కరిస్తున్నామని చెప్పారు. త్వరలో తాము కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు.
పార్జీ జనరల్ సెక్రటరీ ఎవరో కేడర్ నిర్ణయిస్తుందని చెప్పారు. కేడర్ ఎవరిని ఎన్నుకుంటే వారే పార్టీ చీఫ్ అవుతారని చెప్పారు.

రెండ్రోజుల్లో వెళ్లి తరిమేస్తాం
దివంగత జయలలిత నివసించిన వేద నిలయం ప్రజల ఆస్తి అని మధుసూదనన్ చెప్పారు. అందులో ఉన్న వాళ్లను (అందులో శశికళ ఉంటున్నారు) వెళ్లగొట్టేందుకు రెండు రోజుల్లో అక్కడకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. మాపై చర్యలు తీసుకునే అధఇకారం శశికళకు లేదన్నారు. ఆమెను తాము బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన నెంబర్ గేమ్‌లో ఎలాగైనా నెగ్గేందుకు శశికళ వర్గం పావులు కదుపుతోంది. గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉంచిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను బయటి వ్యక్తులతో మాట్లాడకుండా మొబైల్ జామర్లను ఏర్పాటు చేశారు.
లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. కొత్తగా రూమ్స్ బుక్ చేసుకునేందుక కూడా ఎవరినీ రానివ్వడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రిసార్ట్స్ బయట నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
అతి కష్టం మీద జాతీయ మీడియా ప్రతినిధి ఒకరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా శశికళ శిబిరంలోని ఓ నేత అడ్డుతగిలారు. తాను ఏఐఏడీఎంకే నాయకుడిననీ, ఇది ప్రయివేటు రిసార్టు అయినందున ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని వాదించాడు.
దీనికి తోడు అక్కడే కాపలాకాస్తున్న ప్రయివేటు బౌన్సర్లు మీడియా ప్రతినిధులను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరింపులకు సైతం దిగుతున్నారని అంటున్నారు. రూమ్స్ బుక్ చేసుకునేందుకు కూడా ఎవరికీ అనుమతి లేనందున వెళ్లిపోవాలంటూ సూచించారు.
ఇక్కడ దరిదాపులకు కూడా ఎవరు రాకుండా మోటార్ బైక్‌లు అడ్డంపెట్టి మరికొందరిని కాపలా ఉంచారు. కాగా రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలను నిర్బంధించారంటూ వస్తున్న ఫిర్యాదులపై విచారించాల్సిందిగా ఇప్పటికే గవర్నర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications