మీ సెక్యూరిటీ వద్దు, గుజరాత్ పోలీసులతో అరవింద్ కేజ్రీవాల్
గుజరాత్ ఎన్నికలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆటోవాలా తన ఆటోలో వస్తావా అని అడగగా.. ఓ యస్ అనేశారు. అయితే ఆటో డ్రైవర్ ఇంటికి వెళుతుండగా పోలీసులు ఆపివేశారు. భద్రతా కారణాలు చెప్పి.. ఆపి వేశారు. ఆ క్రమంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది.
ప్రజలను కలవడానికి కూడా ప్రోటోకాల్ కావాలా అని అడిగారు. సెక్యూరిటీ పేరతు ఆపడం సరికాదన్నారు. మీ సెక్యూరిటీ వద్దు అని.. కావాలంటే మీరే తీసుకోవాలని కోరారు. మీరు తనను అరెస్ట్ చేయలేరని కేజ్రీవాల్ అన్నారు.

సోమవారం అహ్మదాబాద్‌లో ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. ఒక ఆటో డ్రైవర్ అరవింద్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. దీనికి కేజ్రీవాల్ అంగీకరించారు. విక్రమ్ దంతాని అనే ఆటోడ్రైవర్ మాట్లాడాడు. కేజ్రీవాల్ అభిమానిగా చెప్పుకున్న విక్రమ్, ఆయనను తన ఇంటికి డిన్నర్‌కు రమ్మని పిలిచాడు.
పంజాబ్‌లో ఒక డ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లిన సంగతి తెలుసు అని గుర్తుచేశారు. ఇంటికి డిన్నర్‌కు వస్తారా అని కేజ్రీవాల్‌ను అడిగాడు. ఈ రోజే రమ్మంటావా అని కేజ్రీవాల్ అడిగాడు. ఒకవేళ నువ్వు హోటల్‌కు వచ్చి తీసుకెళ్తాను అంటే నీ ఆటోలో వస్తానన్నారు. ఇంకో ఇద్దరిని కూడా తీసుకొస్తానని కేజ్రీవాల్ అన్నాడు.












Click it and Unblock the Notifications