వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ నిర్ణయంతో ఎయిరిండియాకు పెరిగిన గిరాకీ

కొన్ని గల్ప్ దేశాల నుండి హ్యాండ్ లగేజీగా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్ళడంపై అమెరికా నిషేధం విధించింది.అయితే ట్రంప్ తీసుకొన్న నిర్ణయం ఎయిరిండియాను లాభాల బాటలో నడిపిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొన్ని గల్ప్ దేశాల నుండి హ్యాండ్ లగేజీగా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్ళడంపై అమెరికా నిషేధం విధించింది.అయితే ట్రంప్ తీసుకొన్న నిర్ణయం ఎయిరిండియాను లాభాల బాటలో నడిపిస్తోంది.

అమెరికా వెళ్ళే ఎయిరిండియా టిక్కెట్లు దాదాపు వందశాతం అధికంగా అమ్ముడు అవుతున్నాయి.న్యూఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ ల నుండి న్యూయార్క్ , చికాగో , శాన్ ఫ్రాన్సిస్కోలకు నాలుగు ఎయిరిండియా విమానాలు నడుస్తున్నాయి.

air india

గత ఏడాది ఇదే సమయంలో ఒక్కో సర్వీసుకు 150 టిక్కెట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 300 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.

డిమాండ్ పెరగడంతో భారత్ నుండి అమెరికాకు వెళ్ళే విమానటిక్కెట్టు ధర రూ.10 వేలు పెరిగిందని, అదే అమెరికా నుండి ఇండియాకు వచ్చే విమాన టిక్కెట్టు ధర రూ.15 వేలవరకు సంస్థ పెంచిందన్నారు.అయితే అమెరికా నుండి భారత్ కు వచ్చే విమాన టిక్కెట్ల అమ్మకాల్లో పెద్ద పెరుగుదల కన్పించలేదని ఆయన వివరించారు.

English summary
The US ban on large electronic devices as hand luggage on flights originating from some Gulf countries pushed up Air India’s ticket sales to the US by 100 per cent in the last week of March over the period a year ago. Air India saw bookings surge to 300 per day per flight in the period between March 25-31 this year as against a sale of 150 tickets per day per flight in the corresponding period of last year, an airline source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X