12 అంగుళాల వెండి ‘కీ’తో ఆగ్రా ముఖద్వారం తెరవనున్న ట్రంప్, తాజ్‌మహల్ రూపంలో తాళం చెవి..

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఇవాళ ప్రేమకు ప్రతీరూపమైన తాజ్‌మహల్‌ను సందర్శించబోతున్నారు. ట్రంప్ దంపతులకు గుర్తుండేలా విధంగా ఆగ్రా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వారు ఆగ్రా ఎయిర్‌పోర్టులో అడుగిడగానే వారికి ఒక తాళం చెవిని ఇస్తారు. దాంతో వారు నగరాన్ని తెరచి, పర్యటనను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇప్పుడే కాదు విదేశీ ప్రతినిధులు వచ్చిన ప్రతీసారి ఇలా ఏర్పాట్లు చేస్తామని ఆగ్రా కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

 గ్రాండ్ వెల్ కాం..

గ్రాండ్ వెల్ కాం..

ఆగ్రా ఎయిర్‌పోర్టులో ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలుకుతామని ఆగ్రా మేయర్ నవీన్ జైన్ తెలిపారు. ఆ సమయంలోనే 12 అంగుళాల వెండి తాళాన్ని గౌరవ చిహ్నాం అందజేస్తామన్నారు. అక్కడినుంచి వారు తాజ్‌మహల్ వచ్చే ముందు కీ తెరిచి పర్యటన ప్రారంభిస్తారని చెప్పారు. ఓ దేశాధినేత పర్యటన ప్రారంభించే ముందు ఆ నగర తలుపు తెరిచేందుకు సూచిస్తోందని ఆగ్రా మేయర్ నవీన్ జైన్ పేర్కొన్నారు.

12 అంగుళాల వెండి కీ

12 అంగుళాల వెండి కీ

12 అంగుళాల వెండి తాళాన్ని ఢిల్లీలో తయారు చేయించామని నవీన్ జైన్ పేర్కొన్నారు. దీని బరువు 600 గ్రాములు ఉంటుందని తెలిపారు. తాళం తాజ్‌మహల్ ఆకారంలో ఉంది అని ఏఎన్ఐ వార్తాసంస్థతో నవీన్ తెలిపారు. ట్రంప్ దంపతుల పర్యటన సందర్భంగా ఆగ్రా రహదారుల్లో ప్రజలు భారత్-అమెరికా జెండాలను పట్టుకొని నిల్చొని స్వాగతం పలుకుతారని తెలిపారు.

 బ్రహ్మారథం..

బ్రహ్మారథం..

అగ్రరాజ్య అధినేత ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు ఆగ్రా ప్రజలు బిజీగా ఉన్నారు. ట్రంప్ కపుల్‌ అపూర్వమైన స్వాగతం లభిస్తోందని తాను విశ్వసిస్తున్నానని నవీన్ జైన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య మెలానియా, కూతురు ఇవాంకా దంపతులతో కలిసి ట్రంప్ ల్యాండయిన సంగతి తెలిసిందే. అక్కి నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లిన ట్రంప్.. మొతేరా స్టేడియానికి ర్యాలీగా వచ్చారు. మొతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్' కార్యక్రమం తర్వాత ఆగ్రా బయల్దేరి వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+