గొప్పవాడివయ్య స్టాలిన్: జయలలిత, పళనిస్వామి ఫొటోలు కంటిన్యూ..
తమిళనాడు సీఎం స్టాలిన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల నుంచి కూడా ప్రశంసలు పొందేలా వ్యవహరించారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ఉద్దేశించిన 65 లక్షల స్కూల్ బ్యాగ్ లపై మాజీ సీఎంలు జయలలిత,ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి ఇతర పార్టీకి చెందిన సీఎంలు మారితే.. ఖర్చయినా సరే అని మారుస్తారు. కానీ స్టాలిన్ మాత్రం అలా చేయలేదు.
బ్యాగ్ లు మార్చాల్సి రావడంతో రాష్ట్ర ఖజానాకు రూ.13 కోట్లు ఆదా అవుతాయని స్టాలిన్ నిర్ణయించారు. అలా ఆదా అయిన డబ్బుని విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టే మరో సంక్షేమ పథకంలో వినియోగించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోజికి సూచించారు. స్టాలిన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్ని వైపులా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్కూల్ బ్యాగ్ లపై ఫొటోల విషయమై పార్టీ వ్యక్తుల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయని మహేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి ఈ విషయాన్నితీసుకెళ్లినప్పుడు..నువ్వు మంత్రివి అయ్యావయ్యా..పార్టీ సభ్యుడిలా మాట్లాడకు అని నాకు చెప్పారు. రాజకీయాల గురించి చర్చించాలనుకుంటే, అరివలయంని సందర్శిస్తాను అని మంత్రి పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పథకాల నుండి ప్రతిపక్షాల గుర్తులను అధికార పార్టీలు తొలగించడం మనదేశంలో సాధారణమైన విషయన్నది అందరికీ తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా ప్రజాధనం వృద్ధా కాకుండా స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అటు నాయకులు,ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఏడాది మేలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన అన్నా క్యాంటీలను కొనసాగించడం సహా అనేక ఇటువంటి నిర్ణయాలను స్టాలిన్ తీసుకుని విపక్షాల ప్రశంసలను కూడా పొందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications