Doute: నిరుద్యోగి భర్తకు నీఛపుబుద్ది, పని చేస్తున్న భార్య మీద డౌట్, కుక్కర్ తవాతో కొట్టి స్పాట్ లో చంపేసి ?

లూధియానా/ పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంతపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త పనిపాటా చెయ్యకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పని చేసి డబ్బులు సంపాధిస్తున్న భార్య పిల్లలు, భర్తను పోషిస్తోంది. భార్య సంపాదనతో ఆమె భర్త మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. భార్య వంటగదిలో ఉంది. వంటగదిలోకి వెళ్లిన భర్త ఆ రూమ్ లో ఉన్న కుక్కర్ తవా తీసుకుని భార్య తల మీద దాడి చేసి ఆమెను స్పాట్ లో చంపేశాడు.

దంపతులు హ్యాపీలైఫ్

దంపతులు హ్యాపీలైఫ్

పంజాబ్ లోని మోగా నగరంలో చక్కివాలి గల్లీ ఏరియాలో పర్మీందర్ సింగ్ అలియాస్ పర్మీందర్ అనే వ్యక్త నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రజనీ అనే యువతిని పర్వీందర్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న పర్మీందర్ సింగ్, రజనీ సింగ్ దంపతులు మెగా సిటీలోని చక్కీవాలి గల్లి ఏరియాలో నివాసం ఉంటూ సంతోషంగా జీవించారు.

గాలికి తిరుగుతున్న భర్త

గాలికి తిరుగుతున్న భర్త

పర్మీందర్ సింగ్, రజనీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కొంతకాలం మాత్రమే ఉద్యోగం చేసిన పర్మీందర్ సింగ్ తరువా ఎలాంటి పనిపాటా చెయ్యకుండా గాలికి తిరగడం మొదలుపెట్టాడు. కుటుంబం గడవడం కష్టం కావడంతో పర్మీందర్ సింగ్ అపార్ట్ మెంట్లలో కొన్ని ఇళ్లల్లో ఇంటి పనులు చెయ్యడానికి వెళ్లింది.

బయటకు వెళ్లి పని చేస్తున్న భార్య

బయటకు వెళ్లి పని చేస్తున్న భార్య

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అపార్ట్ మెంట్ రజనీ పని చెయ్యడానిి వెలుతోంది. అపార్ట్ మెంట్స్ లో ఇళ్లల్లో పని చేసి డబ్బులు సంపాధిస్తున్న రజనీ ఆమె ఇద్దరు పిల్లలు, భర్త పర్మీందర్ సింగ్ ను పోషిస్తోంది. భార్య రజనీ సంపాదనతో ఆమె భర్త పర్మీందర్ సింగ్ మద్యం సేవిస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్య మీద అనుమానంతో ఏం చేశాడంటే ?

భార్య మీద అనుమానంతో ఏం చేశాడంటే ?

ప్రతిరోజు బయటకు వెళ్లి వస్తున్న భార్య రజనీ మీద ఆమె భర్త పర్మీందర్ సింగ్ అనుమానం పెంచుకున్నాడు. తన భార్య రజనీ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తోందని పర్మీందర్ సింగ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో పర్మీందర్ సింగ్, రజనీ దంపతుల మద్య గొడవ జరుగుతోంది

భార్యను కుక్కర్ తో కొట్టి చంపేసిన భర్త

భార్యను కుక్కర్ తో కొట్టి చంపేసిన భర్త

రాత్రి పర్మీందర్ సింగ్ ఇంటికి వెళ్లాడు. రజనీ వంటగదిలో ఉంది. పిల్లలు మరో గదిలో ఆడుకుంటున్నారు. ఆ సందర్బంలో వంటగదిలోకి వెళ్లిన పర్మీందర్ సింగ్ ఆ రూమ్ లో ఉన్న కుక్కర్ తవా తీసుకుని అతని భార్య రజనీ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. కుక్కర్ తో బలంగా కొట్టడంతో రక్తం ఎక్కువగా పొవడంతో రజనీ స్పాట్ లో చనిపోయింది.

భర్త మందు కొట్టాడా ? లేదా

భర్త మందు కొట్టాడా ? లేదా

విషయం తెలుసుకున్న పోలీసులు పర్మీందర్ సింగ్ ను అరెస్టు చేశారు. అక్రమ సంబందంతో తన భార్య రజనీ తనను మోసం చేసిందని, అందుకే చంపేశానని పర్మీందర్ సింగ్ లకు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య రజనీని హత్య చేసిన సమయంలో పర్మీందర్ సింగ్ మద్యం సేవించాడా ? లేదా ? అని వైద్యపరీక్షలు చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+