Wife: వయసులో 16 ఏళ్లు తేడా, నా భార్యను నేను సుఖపెట్టలేదా ?, అక్రమ సంబంధం ఉందని పాన్ తో ?
ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు ఇద్దరు మాత్రమే ప్రత్యేకంగా నివాసం ఉంటూ సంతోషంగా జీవించారు. భర్త ఉదయం బయటకు వెళితే రాత్రికే ఇంటికి చేరుకుంటున్నాడు. కొంతకాలం క్రితం భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య నిత్యం ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. భర్త ఎప్పుడు ఫోన్ చేసినా భార్య ఫోన్ ఎంగేజ్ వచ్చేది. ఎవరితో మాట్లాడుతున్నావు అని భర్త ప్రశ్నిస్తే మా అమ్మాతో అని, మా చెల్లెలితో అని ఇలా భార్య ఏదో ఒకటి చెబుతూ వచ్చింది. తన భార్య అక్రమ సంబందం పెట్టుకుని తనను మోసం చేస్తోందని రగిలిపోయిన భర్త ఇంట్లో వంట చేసే పాన్ తీసుకుని భార్య తల మీద కొబ్బరి కాయ కొట్టినట్లు కొట్టేశాడు. భార్య మీద దాడి చేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

భార్యతో కాపురం చేస్తున్న భర్త
ముంబాయిలోని భాండూప్ ప్రాంతంలో బసంత్ సాహా అలియాస్ బసంత్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన రీటా దేవి అలియాస్ రీటా (21) అనే యువతిని బసంత్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న బసంత్, రీటా దంపతులు ఇద్దరు మాత్రమే భాండూప్ ప్రాంతంలో ప్రత్యేకంగా నివాసం ఉంటూ సంతోషంగా జీవించారు.

భార్యకు, భర్తకు వయసులో 16 ఏళ్లు తేడా
బసంత్ కు, రీటాకు వయసులో 16 ఏళ్ల వయసు తేడా ఉంది. బసంత్ ఉదయం బయటకు వెళితే రాత్రికే ఇంటికి చేరుకుంటున్నాడు. పగలు రీటా మాత్రమే ఇంటిలో ఉంటున్నది. వయసులో చాలా చిన్నదైన భార్య రీటాను తాను సుఖపెట్టలేకపోతున్నానా ? అని బసంత్ కు అనుమానం మొదలైయ్యిందని తెలిసింది.

ఫోన్ కు అంకితమైన భార్య...... భర్తకు డౌట్
కొంతకాలం క్రితం భార్య రీటా మీద ఆమె భర్త బసంత్ కు అనుమానం మొదలైయ్యింది. రీటా నిత్యం ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. భర్త బసంత్ ఎప్పుడు ఫోన్ చేసినా రీటా ఫోన్ ఎంగేజ్ వచ్చేది. ఇంటికి వెళ్లిన బసంత్ ఎవరితో మాట్లాడుతున్నావు అని రీటాను ప్రశ్నిస్తే మా అమ్మాతో అని కొన్నిసార్లు, మా చెల్లెలితో మాట్లాడుతున్నాను అని కొన్నిసార్లు ఇలా ఏదో ఒకటి చెబుతూ వచ్చింది.

వంటపాన్ తో భార్య తల మీద కొబ్బరికాయ కొట్టినట్లు కొట్టి ?
తన భార్య రీటా వేరే యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని తనను మోసం చేస్తోందని బసంత్ కొంతకాలం నుంచి రగిలిపోతున్నాడు. రాత్రి ఇదే విషయంలో బసంత్, రీటా దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన బసంత్ ఇంట్లో వంట చేసే పాన్ తీసుకుని అతని భార్య రీటా తల మీద కొబ్బరి కాయ కొట్టినట్లు ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది.

పోలీస్టేన్ కు వెళ్లిన భర్త ఏం చెప్పాండంటే ?
భార్య రీటా తల మీద పాన్ తో దాడి చేసిన తరువాత ఆమె కుప్పకూలిపోవడంతో ఆమె చనిపోయిందని బసంత్ అనుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బంసత్ తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, అందుకే చంపేశానని చెప్పాడు. పోలీసులు ఇంటికి వెళ్లి చూస్తే రీటా బతికే ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఒక్కరోజు చికిత్స పొందిన రీటా ప్రాణాలు వదిలేసింది. రీటాకు అక్రమ సంబంధం ఉందని ఆమెను హత్య చేసిన బసంత్ ను భాండూప్ పోలీసులు అరెస్టు చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications