Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: పెళ్లి జరిగిన రెండు నెలలకే భార్య గర్బవతి, భర్తకు వాడి మీద వాడికే డౌట్, చివరికి ఏం చేశాడంటే ?

బెంగళూరు/దావణగెరె: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన రెండు నెలలకే భార్య గర్బవతి అయిన తరువాత ఆమె మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. గర్బవతి అయిన భార్య కనపడకుండా పోయింది. భార్య కుటుంబ సభ్యులతో పాటు భర్త కూడా ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు, నెలరోజులు దాటిపోయినా భార్య ఆచూకి మాత్రం పోలీసులకు చిక్కలేదు. చివరికి మాయం అయిన గర్బవతి అటవి ప్రాంతంలో శవమై కనిపించింది. మహిళ శరీరం కూడా కుళ్లిపోవడంతో అందరూ షాక్ అయ్యారు, పోలీసుల విచారణలో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

9 నెలల క్రితం పెళ్లి

9 నెలల క్రితం పెళ్లి

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని ఐగూరు గ్రామంలో నివాసం ఉంటున్న చంద్రకళ అలియాస్ రశ్మీ (21) అనే యువతికి, చెన్నగిరి తాలుకాలోని గంగగూండనహళ్లిలో నివాసం ఉంటున్న మోహన్ అలియాస్ మను (24) అనే యువకుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. ఇదే సంవత్సరం మార్చి నెలలో మను, రశ్మీల వివాహం జరిగింది.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న మను, రశ్మీ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్య రశ్మీ గర్బవతి అయిన తరువాత ఆమె మీద మనుకు అనుమానం మొదలైయ్యింది. తన భార్య రశ్మీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనా ?, లేక ఎవరు ?, నా భార్యకు ప్రియుడు ఉన్నాడా ? అని మను అనుమానం పెంచుకున్నాడు.

మాయం అయిన భార్య

మాయం అయిన భార్య

డైరెక్ట్ గా అడిగితే నా భార్య రశ్మీ నిజం చెప్పదని అనుకున్న మను ఆమెను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. గర్బవతి అయిన రశ్మీని ఆమె భర్త మను, అతని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా చిత్రహింసలకు గురి చేశాడు. 48 రోజుల క్రితం రశ్మీ కనపడుకుండా పోవడంతో ఆమె కుటుంబ సబ్యలు మిస్సింగ్ కేసు పెట్టారు.

నాటకాలు ఆడిన భర్త

నాటకాలు ఆడిన భర్త

రశ్మీ కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులతో పాటు మను 43 రోజుల పాటు రశ్మీ కోసం గాలించాడు. మను తీరుతో అనుమానం రావడంతో రశ్మీ తల్లిదండ్రులు అల్లుడి మీద కేసు పెట్టారు. పోలీసులు మను మీద నిఘా వేశారు. చివరికి పోలీసులు రశ్మీ భర్త మనును అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

ఆరు నెలల గర్బవతిని చంపేసి అడవిలో శవం

ఆరు నెలల గర్బవతిని చంపేసి అడవిలో శవం

పోలీసులు మనును బెండ్ తియ్యడంతో అతను అసలు విషయం చెప్పాడు. వివాహం అయిన రెండు నెలలకే తన భార్య రశ్మీ గర్బవతి అయ్యిందని, ఆమె మీద అనుమానంతో గొంతు నులిమి చంపేసి శవాన్ని అటవి ప్రాంతంలో పూడ్చిపెట్టేశానని మను అంగీకరించాడు. అటవి ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రశ్మీ శవాన్ని బయటకు తీసిన పోలీసులు ఆ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు.

రశ్మీని ఆమె భర్త చంపేశాడు

రశ్మీని ఆమె భర్త చంపేశాడు

భార్య రశ్మీ మీద అనుమానంతో ఆమె భర్త మను అతని కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మను తల్లిదండ్రులు, సోదరుడు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని దావణగెరె పోలీసులు తెలిపారు. ఆరు నెలల గర్బవతి హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+