Doute: వారం రోజులు డ్యూటీలోనే ఉన్న భర్త, వయసులో ఉన్న భార్యను స్పాట్ లో చంపేసి ?
చెన్నై/మైలాడుతురై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. పిల్లలను చూసుకుంటూ భార్య ఇంటిలోనే ఉంటున్నది. డ్యూటీకి వెలుతున్న భర్త ఒక్కోసారి వారం రోజులు, పది రోజుల తరువాత ఇంటికి వెలుతున్నాడు. వయసులో ఉన్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

15 ఏళ్ల క్రితం పెళ్లి
తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలోని కుతలాం తాలుకాలోని మేళా అగలంగన్ ప్రాంతంలో ఆరోగ్య శశి అలియాస్ శశి (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బంధులువు చూపించిన మైలాడుతురై జిల్లాకు చెందిన రమ్యా (32) అనే యువతిని శశి సంతోషంగా వివాహం చేసుకున్నాడు.

భర్త లాడీ డ్రైవర్
వివాహం చేసుకున్న శశి, రమ్యా దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. రమ్యా, శశి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శశి లాడీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రమ్యా భర్త శశి డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. పిల్లలను చూసుకుంటున్న శశి భార్య రమ్యా ఇంటిలోనే ఉంటున్నది.

వారం, 15 రోజులు డ్యూటీలోనే ఉంటున్న భర్త
డ్యూటీకి వెలుతున్న శశి ఒక్కోసారి వారం రోజులు, పది రోజులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ తరువాత ఇంటికి వెలుతున్నాడు. వయసులో ఉన్న భార్య రమ్యా మీద ఆమె భర్త శశికి అనుమానం మొదలైయ్యింది. తన భార్య రమ్యా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, నేను డ్యూటీకి వెలుతున్న తరువాత అతనితో ఎంజాయ్ చేస్తోందని శశి విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు.

భార్యను స్పాట్ లో చంపేశాడు
భార్య రమ్యా అక్రమ సంబంధం విషయంలో శశి ఆమెతో నిత్యం గొడవలు పడుతున్నాడు. వారం రోజుల క్రితం డ్యూటీకి వెళ్లిన శశి రాత్రి ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన శశి ఇనుప రాడ్ తీసుకుని అతని భార్య రమ్యా తల మీద దాడి చేసి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications