వరకట్న మరణాలపై సుప్రీం సీజే రమణ బెంచ్‌ కీలక తీర్పు-సెక్షన్ 304బీ పరిధి పెంపు

భారత్‌లో వరకట్న మరణాల నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. వరకట్న మరణాల్లో నిందితులు సెక్షన్ 304బీలో ఉన్న లోపాల్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాధితురాలు మరణానికి ముందు వేధింపులకు గురైందన్న అంశాన్ని అడ్డుపెట్టుకుని శిక్షల నుంచి నిందితులు తప్పించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపపడింది.

వరకట్న మరణాలు జరిగినప్పుడు బాధితురాలు భర్త, అత్తమామల చేతిలో చనిపోతే నిందితులకు గరిష్టంగా ఏడేళ్లు శిక్ష పడుతోంది. అయితే బాధితురాలు మరణానికి ముందే గాయాలపాలైతే, లేదా వేధింపులకు గురైతే వాటిని అడ్డంపెట్టుకుని తమకు శిక్ష తగ్గించాలని నిందితులు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చట్టంలోని ఇలాంటి లొసుగుల వల్లే నిందితులు తప్పించుకుంటున్నారని, తద్వారా దేశంలో వరకట్న మరణాలు పెరుగుతున్నాయని సీజేఐ ఎన్వీరమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

Dowry deaths- Supreme Court widens scope of Section 304-B

Recommended Video

    Coronavirus In India : అదుపులోకి వ‌స్తున్న COVID 19 | Lowest In 44 Days

    వరకట్న నిరోధక చట్టంలోని సూన్‌ బిఫోర్‌ నిబంధనను అడ్డుపెట్టుకుని నిందితులు మరణానికి ముందే బాధితురాలు వేధింపులకు గురైంది కాబట్టి ఆమె మరణానికి తాము పూర్తి కారకులం కాదని వాదించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాధితురాలి మరరణాని, ఆమెపై జరిగిన వేధింపులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉందని తెలిపింది. ట్రయల్‌ కోర్టులు కూడా సెక్షన్‌ 304బీ విషయంలో ఈ లొసుగుని అంగీకరించవద్దని సుప్రీంకోర్టు సూచించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+