‘డాక్టర్ డెత్’ దారుణం: ఫాం హౌస్ లో ఆరు మందిని చంపేశాడు
ముంబై: మహారాష్ట్ర లోని సతారా జిల్లా వైయ్ నగరంలో డాక్టర్ డెత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ అంగన్ వాడి మహిళా కార్యకర్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో డాక్టర్ సంతోష్ పాల్ ను అరెస్టు చేశారు.
డాక్టర్ సంతోష్ పాల్ ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యగా అతడు చెప్పిన వాస్తవాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు.
మాయం అయిన మహిళతో పాటు మరో ఐదు మందిని హత్య చేశానని డాక్టర్ సంతోష్ పాల్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

నిందితుడు తెలిపిన వివరాల ఆధారంగా అతడి ఫాం హౌస్ లో ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
కొన్ని సంవత్సరాల క్రితం మంగల్ జేథ్ (49) అనే అంగన్ వాడి మహిళా కార్యకర్త ఇంటి నుంచి వెళ్లి మాయం అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
విచారణ చేసిన పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా ఎవరో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని గుర్తించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతున్నది.
చివరికి డాక్టర్ సంతోష్ పాల్ మంగల్ జేథ్ కిడ్నాప్ చేసి హత్య చేశాడని తెలుసుకుని అతనిని అరెస్టు చేశారు. విచారణలో మొత్తం ఆరు మందిని తాను హత్య చేశానని డాక్టర్ సంతోష్ పాల్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
అతడు ఇచ్చిన సమాచారం మేరకు అతని ఫాం హౌస్ లో ఐదు మంది మహిళలు, ఓ పురుషుడి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
మహిళలపై అత్యాచారం చేసిన తరువాత లెతల్ మెడిసిన్ ఓబర్ డోస్ ఇచ్చి హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ఈ డాక్టర్ కు ఓ నర్సు సహకరించిందని పోలీసులు చెప్పారు.
ప్రాణాంతకమైన మందులు మోతాదుకు మించి ఇచ్చి వారిని అంతం చేశాడని, ఇతను ఈ ఆరు మందినే కాకుండా చాల మందిని హత్య చేసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications