సీఎంకు చీర్ లీడర్స్ నచ్చలేదు, రాముడి పాటలు పెట్టండి: ఐపీఎల్‌పై డిగ్గీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రానున్న ఐపీఎల్‌ టోర్నమెంటులో చీర్ లీడర్స్‌ను తొలగించి శ్రీరాముడి పాటలు పెట్టాలని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగనున్నాయి.

అయితే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ఈ మూడు మ్యాచ్‌లకు వినోద పన్ను మినహాయింపునకు నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్‌ నేత డిగ్గీ స్పందించారు. మ్యాచ్‌ల్లో చీర్ లీడర్లు ఉండటం ముఖ్యమంత్రికి నచ్చకే పన్ను మినహాయించడం లేదన్నారు.

Drop cheerleaders, play tunes in praise of Lord Rama in IPL: Digvijaya Singh

ఇందకు పరిష్కారంగా చీర్ లీడర్లకు బదులు క్రికెటర్లు ఫోర్లు సిక్స్‌లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు శ్రీరాముడి పాటలు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. దేశంలో క్రికెట్‌కి చాలా క్రేజ్‌ ఉందని, కాబట్టి వినోదపు పన్ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress general secretary DigvijayBSE 2.44 % Singh today suggested IPL organisers to do away with cheerleaders and play tunes in praise of Lord Rama during T20 matches instead.
Please Wait while comments are loading...