Drug mafia: దేశంలో దిక్కులేని సమస్యలు, హీరోయిన్ల ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తారా ? పరుల్ ఫైర్ !
బెంగళూరు/ ముంబాయి: దేశంలో దిక్కులేనన్ని సమస్యలు ఉన్నాయని, అందరికీ డ్రగ్ కేసు మాత్రమే కనపడుతోందని ప్రముఖ బాహుబాష నటి పరుల్ యాదవ్ మండిపడుతోంది. ఓ పక్క కరోనా వైరస్, మరో పక్క చైనా ఆగడాలు, దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయింది, ఇలాంటి సమస్యలు పక్కనపెట్టి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి, రాగిణి ద్వివేది, సంజనాల గురించి లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని, వారి ప్రైవేట్ వీడియోలు లీక్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని నటి పరుల్ యాదవ్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లు ప్రైవేటు వీడియోలు ఇలాంటి సమయంలో విడుదల చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని పరుల్ యాదవ్ ఫైర్ అవుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తారా ?
దేశంలో దిక్కులేనన్ని సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఎక్కడా చర్చ జరగడం లేదు, ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి పరుల్ యాదవ్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి, బహుబాష నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ చేస్తూ లేనిపోని రచ్చ చేస్తున్నారని పరుల్ యాదవ్ మండిపడింది. తన ఫేస్ బుక్ పేజ్ లో పరుల్ యాదవ్ సుధీర్ఘంగా నెటిజన్లకు పరుల్ యాదవ్ క్లాస్ పీకింది.

దేశంలో ముగ్గురే తప్పు చేశారా ?
భారతదేశంలో తప్పు చేసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు చాలా మంది ఉన్నారని, వారందరినీ అరెస్టు చేశారా ? అని నటి పరుల్ యాదవ్ పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లు ఎంతో మంది దర్జాగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని పరుల్ యాదవ్ ఆరోపించారు. అయితే దేశంలో రియా చక్రవర్తి, రాగిణి ద్వివేది, సంజనా మాత్రమే తప్పు చేశారు అని ఎత్తి చూపిస్తున్నారని బహుబాష నటి పరుల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.

హీరోయిన్ల ప్రైవేటు వీడియోలు లీక్ !
పెద్దపెద్ద రాజకీయ నాయకులు, సినీ తారలు కలుసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుందని పరుల్ యాదవ్ గుర్తు చేస్తున్నారు. తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్టు చెయ్యకుండా వారిని పోలీసులు వదిలేస్తున్నారని పరుల్ యాదవ్ ఆరోపించారు. అయితే డ్రగ్స్ సేవించారని ఆరోపణలతో రియా చక్రవర్తి, రాగిణి ద్వివేది, సంజనాలను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారణ చేస్తున్న సమయంలో తీసిన ప్రైవేటు వీడియోలను బయటకు విడుదల చేసి వారి జీవితాలతో చెలగాడం ఆడుతున్నారని నటి పరుల్ యాదవ్ మండిపడుతున్నారు.

ఎవరి కోసం పని చేస్తున్నారు ?
పోలీసులు ప్రజల కోసం పని చెయ్యాలని, వారి సమస్యలు పరిష్కరించడానికి ఆసక్తి చూపించాలని నటి పరుల్ యాదవ్ సలహా ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో సంజనాను అరెస్టు చేసిన సమయంలో ఓ లేడీ పోలీసు వీడియో తీస్తున్న విషయం మీడియాలో స్పష్టంగా కనపడిందని పరుల్ యాదవ్ ఆరోపించారు. సంజనాను అరెస్టు చేస్తున్న సమయంలో లేడీ పోలీసు తీసిన వీడియోను మీడియాకు విడుదల చేశారని పరుల్ యాదవ్ ఆరోపించింది. అసలు పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా ?, లేదా మీడియా కోసం పని చేస్తున్నారా ? అంటూ పరుల్ యాదవ్ ప్రశ్నించారు.

పక్కా స్కెచ్ తో నాటకాలు
దేశంలోని సమస్యల గురించి ప్రజలు ఆలోచించకుండా చెయ్యడానికి తెర మీదకు డ్రగ్స్ కేసులు తీసుకువచ్చారని, అందుకే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు రియా చక్రవర్తి, రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను అరెస్టు చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నటి పరుల్ యాదవ్ ఆరోపించారు.

నిజమైన దేశభక్తులు ఎవరంటే !
దేశ సమస్యల గురించి ఆలోచించే వాళ్లే నిజమైన దేశభక్తులని, ఇలా చిల్లర రాజకీయాలు చేసే వాళ్లు కాదని, ఇకనైనా ప్రజలు సమస్యల గురించి ఆలోచించాలని, జైహింద్ అంటూ నటి పరుల్ యాదవ్ సోషల్ మీడియాలో సుధీర్ఘంగా ప్రజలకు క్లాస్ పీకారు. మొత్తం మీద నటి పరుల్ యాదవ్ పనిలో పనిగా రాజకీయ నాయకులు, పోలీసులు, నెటిజన్ల మీద ఓ మోస్తారులో ఫైర్ అయిపోవడంతో ప్రజలు షాక్ కు గురైనారు. నీ నీతులు చాలు తల్లి అంటూ కొందరు నెటిజన్లు పరుల్ యాదవ్ కు సలహా ఇచ్చారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications