తాగిన బీజేపీ ఎంపీ సభలో అసభ్యంగా: మహిళా ఎంపీలు
న్యూఢిల్లీ: లోకసభలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెసు పార్టీ (టీఎంసీ) పార్లమెంటు సభ్యుల మధ్య మంగళవారం వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమ పట్ల అభ్యంతరకరంగా, అసభ్యంగా ప్రవర్తించాలని టీఎంసీ మహిళా ఎంపీలు ఆరోపించగా.. బీజేపీ ఎంపీలు ఖండించారు.
టీఎంసీ ఎంపీలు కోకిలా ఘోష్ దస్తీదార్, కల్యాణ్ బెనర్జీలు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్‌ను నిరసిస్తూ తాము లోకసభలో ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎంపీలు తమ పైన దాడి చేశారని ఆరోపించారు. ఓ బీజేపీ ఎంపీ తాగి ఉన్నాడని ఎంపీ దస్తీదార్ ఆరోపించారు.

తమ పార్టీకి చెందిన మరో ఎంపీ శతాబ్దీ రాయ్ పట్ల కూడా బీజేపీ ఎంపీలు అమానుషంగా ప్రవర్తించారని, దాడి చేస్తామని బెదిరించారని వారు ఆరోపించారు. బెదిరించిన బీజేపీ ఎంపీ తాగి ఉన్నాడని ఆమె ఆరోపిస్తున్నారు.
అయితే, బేజీపీ మాత్రం టీఎంసీ మహిళా ఎంపీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. టీఎంసీ డ్రామాకు తెరలేపుతోందని మండిపడ్డారు. ఎంపీలు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో టీఎంసీ ఎంపీలు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శించారు. అలాంటి సమయంలో తాము సర్దుబాటుకు ప్రయత్నించాం తప్ప దూషించలేదన్నారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications