పెద్ద కూతురి పట్ల అసభ్యంగా..: భర్తను కట్టేసి కాల్చి చంపిన భార్య

జైపూర్: తాగి వచ్చి తననూ తన పిల్లలనూ కొట్టిన భర్తను ఓ మహిళ చేతులూ కాళ్లూ కట్టేసి నిప్పు పెట్టి చంపేసింది. పిల్లలు అందుకు సహకరించారు. ఒడిశాలోని జైపూర్ జిల్లా సరబులిలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు బుధవారంనాడు చెప్పారు

ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. భార్య, పిల్లల చేతిలో గాయపడిన వ్యక్తి కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారంనాడు మరణించాడు. సుభాష్ సింగ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Drunk Odisha man tied up by wife, children, set on fire for beating them

అతను తాగి వచ్చి పెద్ద కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించింది. దాంతో కూతురిని అతను కొట్టాడు. సుభాష్ సింగ్ భార్య, మరో కూతురు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో అతను భార్యను, రెండో కూతురిని కూడా కొట్టాడు.

భార్య, పిల్లలు అతన్ని గట్టిగా పట్టుకుని కాళ్లూ చేతులూ కట్టేశారు. ఆ తర్వాత భార్య సుభాష్ సింగ్‌పై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. దాంతో అతను కేకలు వేశాడు, ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పివేశారు.

అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కటక్‌లోని ఎస్‌సిబి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించార. ఆ ఘటనలో సుభాష్ సింగ్ భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+