రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా: అడ్డుకున్న డీఎస్పీని లారీలతో తొక్కించి, చంపారు

ఛండీగఢ్: హర్యానా రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా ఓ డీఎస్పీనే దారుణంగా హత్య చేసింది. తౌరు డీఎస్పీ సురేందర్ సింగ్‌ను గుగుగ్రామ్‌కు దగ్గరగా ఉన్న నుహ్స్ పచ్‌గావ్ సమీపంలో సోమవారం అక్రమ మైనింగ్ మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆయనను లారీలతో తొక్కించారు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా, డీఎస్పీ మృతదేహం బహిరంగ చెత్తకుప్పలో లభ్యమైంది. అయితే, డీఎస్పీ సురేందర్ సింగ్ త్వరలో పదవీ విరమణ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 DSP attacked, killed By Alleged Mining Mafia Near Gurugram, Haryana.

తాజా సమాచారం ప్రకారం.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యలో ఒకటి కంటే ఎక్కువ లారీల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

మెవాత్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారంతో డీఎస్పీ సురేందర్ సింగ్ అక్కడికి వెళ్లారు. అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. పలు లారీలతో డీఎస్పీని ఢీకొట్టాయి. కిందపడిన అతనిపైనుంచి లారీలను ఎక్కించారు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మరణించారు.

డీఎస్పీ సురేందర్ సింగ్ హత్య ఘటనపై హర్యానా పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. డీఎస్పీ హత్యకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఒక ధైర్యవంతుడైన అధికారిని తమ పోలీసు శాఖ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+