ప్రైవేటు వీడియోలు లీకవ్వడంతో యువతి ఆత్మహత్య.. ప్రియుడే ఆ పని చేశాడు!

ఆత్మహత్యకు పాల్పడిన యువతి కుటుంబం మధ్యప్రదేశ్ లో ఉంటుండగా.. చదువు నిమిత్తం యువతి ఢిల్లీలో ఉంటోంది. ఈ క్రమంలోనే తోటి విద్యార్థి వేద ప్రకాశ్ తో పరిచయం ప్రేమకు, ఆపై సహజీవనానికి దారితీసింది.

న్యూఢిల్లీ: కాలేజీలో ఒక్కటయిన ఆ ఇద్దరు తొందరగానే ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ఆ దగ్గరితనం మూడేళ్ల సహజీవనానికి దారితీసింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ భావించినప్పటికీ.. ఏవో మనస్పర్థలు, విభేదాల వల్ల ఇద్దరి బంధం పెళ్లి దాకా వెళ్లేదు. ఇంతలో ఇద్దరి మధ్య ఎడం పెరిగింది. ఉన్నట్లుండి ఇద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోలో ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి.

వీడియోలు సోషల్ మీడియాలో పోస్టవడం తట్టుకోలేని యవతి ఆత్మహత్యకు పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయి(21) ఢిల్లీ యూనివర్సిటీలో బీకాం చదవుతున్నట్లుగా గుర్తించారు. యువతి రాసిన సూసైడ్ నోట్ ను పరిశీలిస్తే.. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రియుడేనని తెలుస్తోంది.

DU girl hangs self as lover threatens to leak private videos

కాగా, ఇటీవల తనపై అత్యాచారం జరిగినట్లుగా కూడా యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇంతలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ పోలీసులు పాట్నాకు చెందిన నిందితుడు వేదప్రకాశ్ పై కేసు పెట్టారు. అతన్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్ ను కూడా పంపించినట్లు డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన యువతి కుటుంబం మధ్యప్రదేశ్ లో ఉంటుండగా.. చదువు నిమిత్తం యువతి ఢిల్లీలో ఉంటోంది. ఈ క్రమంలోనే తోటి విద్యార్థి వేద ప్రకాశ్ తో పరిచయం ప్రేమకు, ఆపై సహజీవనానికి దారితీసింది. పెళ్లికి ఇద్దరి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి కలయిక సాధ్యపడలేదు. దీంతో తల్లిదండ్రులను వదిలేసి బీహార్ వచ్చేయాల్సిందిగా ప్రకాశ్ యువతిని కోరాడు.

అయితే అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరు కలిసి ఉన్న వీడియోలు బయటపెడుతానని యువకుడు బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిసింది. ఇదే నేపథ్యంలో కొంతకాలానికి ఢిల్లీ నుంచి బీహార్ వెళ్లిపోయిన అతను చాలాసార్లు యువతికి ఫోన్ చేసినా.. ఆమె నుంచి జవాబు రాలేదు. దీంతో ఇద్దరి మధ్య పూర్తిగా సంబంధం లేకుండా పోయింది. ఏప్రిల్ 8న అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+