విమానం గాలిలో ఉండగానే మంటలు, అందరూ మనోళ్లే! (వీడియో)
తిరువనంతపురం: విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకున్న సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ విమానంలో అందరూ కేరళవాసులే ఉన్నారు.
We can confirm flight EK521 from Thiruvananthapuram to Dubai has been involved in an accident at Dubai International.
— Emirates airline (@emirates) August 3, 2016
విమానం దుబాయ్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, అది రన్ వే పైన దిగుతుండగా.. గాలిలో ఉండగానే మంటలు చెలరేగాయి. విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో దింపారు. ప్రయాణీకులను సురక్షితంగా కిందకు దించారు. ఇది బుధవారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది.

దీనిపై ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు (స్థానిక కాలంమానం) ఎమిరేట్స్ విమానంలో మంటలు వచ్చినట్లు నిర్ధారించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications