భళ్లాలదేవ రథం నుంచి పుట్టిన రోడ్ క్లీనర్: ఊడ్చిపారేస్తోంది, ఎక్కడంటే..?

Subscribe to Oneindia Telugu

దుర్గ్: బాహుబలి తొలిభాగం, రెండో భాగం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించాయో తెలిసిన విషయమే. ఆ సినిమాల ప్రభావం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉంది. రాజకీయ పార్టీల అధినేతలను ఆ పార్టీ నేతలు బాహుబలిగా అభివర్ణించుకుంటున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ మున్సిపాలిటీ ఓ అడుగు ముందుకేసింది.

బాహుబలిలో..

బాహుబలిలో..

బాహుబలి సినిమాలో యుద్ధ సమయంలో భళ్లాలదేవ(రానా) రథం శుత్రుమూకను ఎలా ఛండాడిందో సినిమా చూసిన ప్రతీవారికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇలాంటి రథంలానే తయారు చేసిన ఓ వాహనం.. దుర్గ్ రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని ఊడ్చిపారేస్తోంది. బాహుబలి సినినామాలో భళ్లాలదేవ రథానికి కత్తులుంటే... దుర్గ్‌లోని చెత్త రథానికి చీపుర్లున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను తగ్గించాలనుకున్న దుర్గ్ మున్సిపాలిటీ ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. ఫలితంగా తక్కువమంది సిబ్బందితోనే దుర్గ్‌రోడ్లు తళతళలాడిపోతున్నాయని మున్సిపాలిటీ అధికారులు చెబతున్నారు.

దుర్గ్ రోడ్ క్లీనర్

దుర్గ్ రోడ్ క్లీనర్

ఈ వాహనానికి మున్సిపాలిటీ... ‘దుర్గ్‌ రోడ్ క్లీనర్' అని పేరుపెట్టింది. ఇటువంటి 30 వాహనాల సాయంతో పట్టణంలోని అన్ని రోడ్లను గంట వ్యవధిలో శుభ్రం చేయవచ్చని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

బాహుబలి సినిమా చూసి..

బాహుబలి సినిమా చూసి..

బాహుబలి సినిమా చూసిన మున్సిపల్ అధికారి రాజ్‌కుమార్‌కు ఈ వాహనాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చిందట. ఇందుకోసం సిబ్బందితో సమావేశమై చర్చించారు. తరువాత నిపుణుల సాయంతో చెత్తవాహనాన్ని రూపొందించారు. ప్రస్తుతం దీనిని వినియోగస్తున్నప్పటికీ, మరింత అభివృద్ధి చేయాలని మున్పిపల్ అధికారులు భావిస్తున్నారు.

లోటుపాట్లను సరిదిద్దాల్సిందే..

లోటుపాట్లను సరిదిద్దాల్సిందే..

అయితే, ఆ వాహనం రోడ్డుపై చెత్తా, చెదారాన్ని శుభ్రం చేస్తోంది కానీ.. ఆ వాహనం చీపుర్లు తిరిగే స్పీడుకు రోడ్లపైన చెత్తా, చెదారం రోడ్ల పక్కన ఉన్న షాపులు, వాహనాలు, ప్రజలపైనా పడుతుండటం గమనార్హం. ఈ ఐడియా బాగున్నప్పటికీ మరింత అభివృద్ధి చేసి లోటుపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Durg Municipal corporation make Bhallal for cleaning city.
Please Wait while comments are loading...