పాలక్కడ్ మున్సిపల్ కార్యాలయంపై జాతీయ జెండా.. ప్రదర్శించిన డీవైఎఫ్ఐ.. ఎందుకంటే..
కేరళలో కమ్యూనిస్టులు-కమల దళం మధ్య పోరు కొనసాగుతోంది. ఇటీవల పాలక్కడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఆ రోజు కొందరు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంపై మోడీ, అమిత్ షా ప్లెక్సీ.. దాంతోపాటు శివాజీ, జై శ్రీరాం అని ఉండే బ్యానర్లు ప్రదర్శించారు. బుధవారం వారు ఇలా చేయగా.. దానికి ప్రతీగా కమ్యునిస్టులు శుక్రవారం నిరసన తెలిపారు. జాతీయ జెండాను ప్రదర్శించి తమ వ్యతిరేకతను చాటారు.

బుధవారం ప్రదర్శించిన బ్యానర్ల వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీంతో డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఇవాళ తమ నిరసన తెలిపారు. పాలక్కడ కార్యాలయంపై జాతీయ జెండాను ప్రదర్శించారు. అయితే నిబంధనలకు విరుద్దంగా పార్టీ జెండాను ప్రదర్శించిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కానీ స్థానికంగా మాత్రం ఈ అంశం చర్చకు దారితీసింది. ఇరువర్గాలు తమ నిరసనలను బ్యానర్ల ద్వారా తెలియజేశారు. వరసగా జెండాల ప్రదర్శనలతో ఇరు వర్గాలు వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications