గవర్నర్‌తో అరగంటపాటు పళనిస్వామి చర్చ, మీడియాతో మాట్లాడకుండా..
అన్నాడీఎంకే నేత పళనిస్వామి మంగళవారం నాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిసారు. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఆయనకు గవర్నర్ అపాయింటుమెంట్ ఇచ్చారు.
చెన్నై: అన్నాడీఎంకే నేత పళనిస్వామి మంగళవారం నాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిసారు. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఆయనకు గవర్నర్ అపాయింటుమెంట్ ఇచ్చారు.
దీంతో పళనిస్వామి మరో సీనియర్ నేత సెంగొట్టోయాన్‌తో కలిసి కలిశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆయన సమర్పించారు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మద్దతు ఉందని చెప్పారు.

గవర్నర్‌తో ఆయన దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం మీడియాతో పెద్దగా మాట్లాడలేదు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే ఎమ్మెల్యేల మద్దతు ఉందని మాత్రమే చెప్పారు. అంతకుమించి ఆయన మాట్లాడలేదు.
అనంతరం ఆయన తన వర్గం (శశికళ వర్గం) ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టుకు వెళ్లారు. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆమె.. అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా పళనిస్వామిని తెరపైకి తీసుకు వచ్చారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఈ రోజు రాత్రి గవర్నర్‌ను కలిసే అవకాశముంది.












Click it and Unblock the Notifications