వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర భారతంలో భూకంపం, భయంతో పరుగులు తీసిన ప్రజలు

ఉత్తర భారత ప్రజలను భూకంపం భయాందోళనలకు గురి చేసింది. సోమవారం రాత్రి పూట పదిన్నర గంటలకు ముప్పై సెకన్ల పాటు భూమి కంపించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్ , చంఢీఘడ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో భూమి కంపించింది.ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు

గురయ్యారు.ఉత్తరాఖండ్ కేంద్రంగా భూకంపం చోటుచేసుకొంది.

సుమారు ముప్పై సెకండ్ల పాటు సోమవారం రాత్రి భూమి కంపించింది.రిక్టర్ స్కేల్ పై భూ కంప తీవ్రత 5.3 గా నమోదైంది.

ఉత్తరాఖండ్ కేంద్రంగా భూకంప కేంద్రం ఉందని అధికారులు చెబుతున్నారు. ముప్పై సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

earth quake

ఉత్తరభారత్ లో భూమి ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘడ్ లో భూమికి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.

ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్ లలో భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి పదిన్నరగంటల సమయంలో ఈ భూకంప కేంద్రం చోటుచేసుకొంది.భూకంపం చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్ళనుండి బయటకు పరుగులు తీశారు.

English summary
earthquake shook Delhi, NCR on Monday evening at around 10:30 pm. Strong tremors lasted for nearly 30 seconds.Earlier in the day, a 5.7-magnitude earthquake also hit central Colombia, shaking large cities including the capital Bogota, officials said, indicating there were no immediate reports of casualties or damage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X