జమ్మూకాశ్మీర్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 3.5గా తీవ్రత నమోదు, భయంతో జనం పరుగులు
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. భూకంపాలను పర్యవేక్షించే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS).. కత్రాకు తూర్పున 84 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది.
'భూకంపం తీవ్రత: 3.5, 17-02-2022న సంభవించింది, 03:02:45 IST, లాట్: 33.08 మరియు పొడవు: 75.83, లోతు: 5 కి.మీ, స్థానం: 84 కి.మీ తూర్పు కత్రా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం' అని NCS ట్వీట్ చేసింది. కాగా, భూకంపం కారణంగా స్వల్పంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.

అంతకుముందు ఫిబ్రవరి 5 న, జమ్మూ కాశ్మీర్‌లో 5.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి, బుద్గామ్ జిల్లాలోని చ్రార్-ఎ-షరీఫ్ వద్ద ఉన్న ప్రసిద్ధ సూఫీ సెయింట్ మినార్ వంగిపోయింది.
షేక్ నూరుద్దీన్ వలీ ప్రార్థనా మందిరం నిర్వాహకులు మాట్లాడుతూ.. టిల్టింగ్‌తో పాటు, ప్రధాన భవనానికి ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు.
Earthquake of Magnitude:3.5, Occurred on 17-02-2022, 03:02:45 IST, Lat: 33.08 & Long: 75.83, Depth: 5 Km ,Location: 84km E of Katra, Jammu and Kashmir, India for more information download the BhooKamp App https://t.co/P7D0o23AEA@ndmaindia @Indiametdept pic.twitter.com/M7ja1aWfXP
— National Center for Seismology (@NCS_Earthquake) February 16, 2022
Recommended Video
మరోవైపు, గురువారం రోజు ఉదయం దాదాపు 5:43 గంటలకు పహల్గామ్‌కు దక్షిణ-నైరుతి దిశలో 15 కి.మీ దూరంలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.












Click it and Unblock the Notifications