ఈశాన్యంలో మళ్లీ భూప్రకంపనలు -బిష్ణుపూర్ కేంద్రంగా మణిపూర్‌లో భూకంపం: ఎన్సీఎస్ వివరాలివి..
వరుస భూకంపాలు ఈశాన్య భారతాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే భూకంపాలు వస్తుండటం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నది. తాజాగా శుక్రవారం రాత్రి కూడా అక్కడ భూకంపం సంభవించింది..
మణిపూర్ లో శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా కేంద్రానికి పశ్చిమనైరుతి దిశగా 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) తెలిపింది.

బిష్ణుపూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా, గత శుక్రవారం తెల్లవారుజామున కూడా మణిపూర్‌లోని ఉక్రుల్‌లో భూప్రకంపనలు సంభవించాయి. దాని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.5గా నమోదయింది.
గత బుధవారం నాడు అసోం, మేఘాలయా, ఉత్తర బెంగాల్‌లో భూప్రకంనలు సంభవించాయి. ఈ భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైంది. దీంతో అస్సాం, గోల్‌పారా, మెఘాలయా, ఉత్తర బెంగాల్, డార్జిలింగ్, కూచ్ బెహార్ వంటి ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలో తరచూ భూ కంపాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఢిల్లీ, యూపీ, బీహార్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మరోవైపు,
అండమాన్ నికోబార్ దీవుల్లో మొన్న మంగళవారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 గా భూకంప తీవ్రత నమోదైంది. పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని యూరోపియన్ -మధ్యధరా భూకంప కేంద్రం మంగళవారంనాడు ప్రకటించింది. భూమి లోపల సుమారు 40 కి.మీ లోతులో భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications