జోన్ 5లో భారీ భూకంపం

ఆ రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. ఆ రాష్ట్రాన్ని వణికించింది. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడి, వెంటనే తమ ఇళ్ల నుండి బయటకు పరుగెత్తారు. దీని ప్రకంపనలు పొరుగు జిల్లాల్లోనూ కనిపించింది. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఎవ్వరూ తమ నివాసాల్లోనికి వెళ్లడానికి ఇష్టపడలేదు. చాలాసేపటి వరకు రోడ్ల పైనే కాలం గడిపారు.

రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. కామ్ జోంగ్ జిల్లాలో ఈ తెల్లవారు జామున 5:59 నిమిషాలకు భూమి ప్రకంపించింది. 24.703 అక్షాంశం, 94.415 రేఖాంశం వద్ద గల ఉఖ్రుల్ కు దక్షిణ- నైరుతి దిక్కున ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మిక్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 62 కిలోమీటర్ల లోతన భూ ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు తెలిపింది.

Earthquake Measuring 5 2 on the Richter scale rocks Manipur the tremors were strong enough in Kamjong

దీని తీవ్రత మణిపూర్ కు ఆనుకుని ఉన్న నాగాలాండ్ లోనూ కనిపించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే పొరుగునే ఉన్న మయన్మార్ పైనా పడింది. భారత్- మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకంపనలు రికార్డయ్యాయి. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, గాయాలు లేదా ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలతో నిద్రలో ఉన్న అనేక మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

దీనిని మిడిల్-డెప్త్ భూకంపంగా వర్గీకరించింది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మిక్. భారత్ లో భూకంపాలు ఎక్కువగా సంభవించే ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్.. దేశంలోనే అత్యధిక ప్రమాదకర విభాగమైన భూకంప ప్రమాద జోన్ 5 పరిధిలోకి వస్తుంది. ఈ కారణంగా ఇది తరచుగా ప్రకంపనలకు గురయ్యే ప్రాంతం అయింది. మయన్మార్‌తో సరిహద్దు పంచుకునే ఈ రాష్ట్రం యాక్టివ్ టెక్టోనిక్ ఫాల్ట్ లైన్‌లపై ఉండటం శక్తిమంతమైన భూకంపాలకు కారణమయ్యాయి.

అయిదుపైగా తీవ్రత ఉండే భూకంపం తర్వాత ప్రకంపనలు సంభవిస్తుంటాయి. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రధాన భూకంపం తర్వాత తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో నివాసితులు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు బలహీనమైన భవనాల నుండి దూరంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+