వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికి మూడు దిక్కుల్లో మూడు భూకంపాలు: కొన్ని గంటల్లోనే: వరుస ప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఈ తెల్లవారు జామున 5:24 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 110 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే బికనేర్‌ను భూకంప కేంద్రంగా గుర్తించింది నేషనల్ సిస్మాలజీ సెంటర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఆ తరువాత కూడా ప్రకంపనలు కొనసాగినట్లు అంచనా వేసింది.

దాదాపు అదే సమయంలో ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలోనూ భూకంపం సంభవించింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:10 నిమిషాలకు భూమి ప్రకంపించినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. మేఘాలయా పశ్చిమ ప్రాంతంలోని గ్యారో హిల్స్‌లో ఈ ప్రకంపనలు నమోదైనట్లు పేర్కొంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా రికార్డయినట్లు వివరించింది. సరిగ్గా రెండున్నర గంటల తరువాత లఢక్‌లో కూడా భూకంపం నమోదైంది. తెల్లవారు జామున 4:57 నిమిషాల సమయంలో లఢక్ రాజధాని లేహ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది.

 Earthquake of magnitude 5.3 on the Richter scale hit Bikaner, Rajasthan: reports NCS

దాదాపుగా ఒకేసారి పశ్చిమ, ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో భూకంపం సంభవింంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బికనేర్‌లో సంభవించిన భూకంపాన్ని తీవ్రమైనదిగా భావిస్తోన్నారు నిపుణులు. భూ ఉపరితలం నుంచి 110 కిలోమీటర్ల లోతున భూమి ప్రకంపించినప్పటికీ.. దాని తీవ్రత 5.3గా నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటోన్నారు. దాదాపుగా నెలరోజుల వ్యవధిలో లఢక్‌లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. కిందటి నెల 28వ తేదీన 4.2 తీవ్రతతో లేహ్‌లో భూమి కంపించింది. అప్పట్లో ఎలాంటి నష్టం సంభించలేదు.

Recommended Video

#earthquake : Earth Tremors Reported In Kukatpally In Hyderabad

English summary
An earthquake of magnitude 5.3 on the Richter scale hit Bikaner, Rajasthan at 5:24 am on Wednesday, according to the National Centre for Seismology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X