వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ప్రధానికి క్లీన్ చిట్ ఇచ్చింది. హిందువుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం, రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై మోడీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి కోడ్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీ , అమిత్ షా ఎన్నికల ప్రచార పిర్యాధుపై ఈసీని వివరణ కోరిన సుప్రిం కోర్టుప్రధాని మోదీ , అమిత్ షా ఎన్నికల ప్రచార పిర్యాధుపై ఈసీని వివరణ కోరిన సుప్రిం కోర్టు

EC clean chit to modi in vardha poll voilation complaint

ఏప్రిల్ ఒకటో తేదిన మహారాష్ట్రలోని వార్దాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పార్టీ వైఖరి, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీకి దిగడంపై ఘాటు విమర్శలు చేశారు. హిందువులను కాంగ్రెస్ అవమానించిందని, అందుకే ప్రజలు ఆ పార్టీని శిక్షించాలని నిర్ణయించుకున్నారని మోడీ అన్నారు. ఆ కారణంగానే రాహుల్ హిందువులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పోటీకి భయపడుతున్నారని, మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వలసపోతున్నారని మోడీ విమర్శించారు. దీంతో ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్న మోడీపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి కంప్లైంట్ చేసింది.

English summary
Prime Minister Narendra Modi's speech at Maharashtra's Wardha, where he accused the Congress of insulting the Hindus through its party chief Rahul Gandhi's candidature from Kerala's Wayanad, does not violate the Model Code, the Election Commission said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X