వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి మరో షాక్ ఇచ్చిన ఈసీ ..టీవీల్లో యాత్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈసీ ఏపీలోని అధికార టీడీపీకి వరుస షాకులు ఇస్తుంది. యాత్ర సినిమా ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో టీవీల్లో వెయ్యకూడదని , ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుందని అభ్యంతరం తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు . అయినాసరే ''యాత్ర'' సినిమాకు లైన్ క్లియర్ అంటూ ఈసీ టీడీపీ నేతలకు షాక్ ఇచ్చింది. యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం చేసుకోవచ్చని ఈసీ చెప్పింది.

హామీలను బాండ్ పేపర్ మీద రాసి మ్యానిఫెస్టో విడుదల చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ హామీలను బాండ్ పేపర్ మీద రాసి మ్యానిఫెస్టో విడుదల చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

టీవీలో యాత్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్.. టీడీపీకి షాక్

టీవీలో యాత్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్.. టీడీపీకి షాక్

టీవీల్లో 'యాత్ర' సినిమాను నిలిపివేయాలని టీడీపీ నేతలు చేసిన అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది.యాత్ర సినిమా ఎన్నికల కోడ్ ని ఏ రకంగానూ ఉల్లంఘించడం లేదని ఈసీ తేల్చి చెప్పింది . టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందని చెప్పిన ఈసీ అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేవని తేల్చిచెప్పింది. టీడీపీ నేతల ఫిర్యాదుకు ఈ మేరకు ఈసీ ఈ విధమైన జవాబునిచ్చింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు సమాధానంగా లేఖ రాసింది. ఈసీ సూచనతో ఒక ఛానల్ లో ఏప్రిల్ 7, 2019 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర సినిమా యధావిథిగా ప్రసారం కానుంది.

వైఎస్సార్ బయోపిక్ ఎన్నికలసమయంలో ప్రసారం అయితే ప్రభావం ఉంటుందని టీడీపీ ఫిర్యాదు

వైఎస్సార్ బయోపిక్ ఎన్నికలసమయంలో ప్రసారం అయితే ప్రభావం ఉంటుందని టీడీపీ ఫిర్యాదు

అయితే యాత్ర సినిమా.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. ఇంకా చెప్పాలంటే వైఎస్సార్ బయో పిక్ . అందుకే ఆ సినిమా చూసే జనాల మీద ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తుంది . ఎన్నికలకు 4 రోజుల ముందు యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం చేయడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా ఈసీ మాత్రం టీడీపీ నేతల అభ్యంతరం అర్ధరహితంగా తేల్చేసింది .

 టీడీపీ నేతల ఫిర్యాదును తోసిపుచ్చిన ఈసీ .. సినిమా ప్రసారం

టీడీపీ నేతల ఫిర్యాదును తోసిపుచ్చిన ఈసీ .. సినిమా ప్రసారం


ఈ చిత్రంతో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని, పోలింగ్ ముగిసేవరకు చిత్రాన్ని ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ నేతల ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. యాత్ర సినిమా నిలిపివేసేందుకు నో చెప్పింది. యాత్ర సినిమా యధావిధిగా టీవీలో ప్రసారం అవుతుంది అని తెలిపింది .

English summary
The Election Commission dismissed TDP leaders' request to stop the 'Yatra' in the TV channels.The TDP leaders requested EC to stop the movie until the polling . it is violating the election code , but EC clarified that their media certification committee had examined the contents of the movie . there is nothing in that movie to violation of the Election Rules. The movie will be aired as a regular film
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X