షాకింగ్: మోదీ ప్రచారంపై నిషేధం కోరుతూ టీఎంసీ లేఖ -ఈసీపై సంచలన ఆరోపణలు -బీజేపీకి అనుకూలమంటూ

మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పోలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఈసీ చర్యలకు దిగిన వ్యవహారంలో వివాదం మరింత ముదిరింది. ఎన్నికల కమిషన్ తీరును ఆక్షేపిస్తూ, అది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదంటూ టీఎంసీ సంచలనల ఆరోపణలు చేసింది. అంతేకాదు, మిగతా దశల ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ప్రచారంపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది..

ఈసీకి టీఎంసీ ఘాటు లేఖ..

ఈసీకి టీఎంసీ ఘాటు లేఖ..

కూచ్ బెహార్ కాల్పుల ఉదంతం, దానికి దారి తీసిన పరిణామాలకు సీఎం మమతా బెనర్జీనే బాధ్యురాలిగా పేర్కొంటూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె ఎన్నికల ప్రచారంపై ఈసీ 24 గంటల నిషేధం విధించడం, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీదీ మంగళవారమంతా ధర్నాకు బైఠాయించడం తెలిసిందే. దీదీపై వేటుతోపాటు గడిచిన నెల రోజులుగా బెంగాల్ లో జరుగుతోన్న పరిణామాలను ఉటంకిస్తూ, ఎన్నికల కమిషన్ తీరును ఎత్తిచూపుతూ టీఎంసీ బుధవారం ఈసీకే ఘాటు లేఖ రాసింది. అందులో..

బీజేపీకి అనుకూలంగా ఈసీ..

బీజేపీకి అనుకూలంగా ఈసీ..

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయడం లేదని, దాని వ్యవహారాలు అత్యంత దుర్భరంగా ఉన్నాని, టీఎంసీ ఫిర్యాదులపై ఒకలా, బీజేపీ ఫిర్యాదులపై మరోలా స్పందిస్తూ, నూరు శాతం పక్షపాత ధోరణిలో, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని టీఎంసీ ఆరోపించింది. ఈసీ అనుచిత, పక్షపాత ధోరణిని బెంగాల్ ప్రజలంతా గమనిస్తున్నారని, టీఎంసీ అభ్యర్థులకు ఓట్లేయడం ద్వారా ప్రజలు.. ఈసీ తీరుకు తగిన సమాధానం చెబుతున్నారని రెండు పేజీల లేఖలో టీఎంసీ తీవ్ర విమర్వలు చేసింది.

మోదీ, షాలను నిషేధించండి..

మోదీ, షాలను నిషేధించండి..

బెంగాల్ లో ఇప్పటిదాకా పూర్తయిన నాలుగు దశల ఎన్నికల్లో ఈసీ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, కనీసం రాబోయే నాలుగు దశల్లోనైనా ఈసీ నిబంధనలకు లోబడి పనిచేయాలని లేఖలో టీఎంసీ పేర్కొంది. బీజేపీ ఫిర్యాదులపై స్పందించిన విధంగానే టీఎంసీ అభ్యంతరాలను ఈసీ పరిశీలించాలని, ఇప్పటికే పలు మార్లు కోడ్ ఉల్లంఘిస్తూ అనుచిత ప్రసంగాలు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై రాబోయే విడదలకైనా ప్రచారాన్ని నిషేధించాలని టీఎంసీ డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+