వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణపై ఈసీ ప్రకటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టమైన ప్రకటన చేసింది. తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికల నిర్వహణ జరుగుతుందని స్పష్టం చేసింది.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రకటనకు ఇంకా సమయం ఉంది. ఓటర్ల తుది జాబితా అక్టోబర్ 8న ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, అనూహ్యంగా నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈసీ ప్రకటించేసింది.

ఒకే దశలో తెలంగాణ పోలింగ్

తెలంగాణలో నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 19న నామినేషన్లకు తుది గడువు

Recommended Video

    నేడే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల!

    నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20

    నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 22
    డిసెంబర్ 7న పోలింగ్
    డిసెంబర్ 11న ఫలితాలు

    EC announce dates of upcoming assembly polls today

    మిజోరాం
    ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
    - నోటిఫికేషన్‌ నవంబర్‌ 2
    - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 9
    - నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 12
    - నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 14
    - ఎన్నికలు నవంబర్‌ 28
    - ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11

    మధ్యప్రదేశ్‌
    230 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
    - నోటిఫికేషన్‌ నవంబర్‌ 2
    - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 9
    - నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 12
    - నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 14
    - పోలింగ్‌ నవంబర్‌ 28
    - ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11

    ఛత్తీస్‌గఢ్‌
    90 శాసనసభ స్థానాలు ఉన్న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని 18 స్థానాల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి.
    మొదటి విడతలో..
    - నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 16
    - నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్‌ 23
    - నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 24
    - నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్‌ 26
    - ఎన్నికలు నవంబర్‌ 12
    - ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11

    రెండో విడతలో..
    - నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 26
    - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబరు 2
    - నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 3
    - నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 5
    - ఎన్నికలు నవంబర్‌ 20
    - ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11


    రాజస్థాన్‌
    200 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
    - నోటిఫికేషన్‌ నవంబర్‌ 12
    - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 19
    - నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 20
    - నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 22
    - ఎన్నికలు డిసెంబర్‌ 7
    - ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11

    Newest First Oldest First
    4:37 PM, 6 Oct

    ఐదుగురు ఏపీ ఎంపీల రాజీనామాలు జూన్ 4న ఆమోదం పొందగా, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా గడువు లేకపోవడంతో ఇప్పుడు ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదేని ఈసీ స్పష్టం చేసింది.
    4:34 PM, 6 Oct

    సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్‌ను ఈసీ ఎప్పటికప్పుడు గమనిస్తోందని తెలిపింది.
    4:30 PM, 6 Oct

    డిసెంబర్‌ 15లోగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ పేర్కొంది.
    4:29 PM, 6 Oct

    ఫలితాలు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు.
    4:29 PM, 6 Oct

    రాజస్థాన్, తెలంగాణ : ఒకే విడత పోలింగ్, డిసెంబర్ 7న పోలింగ్.
    4:27 PM, 6 Oct

    ఛత్తీస్‌గఢ్ : రెండు దశలలో పోలింగ్ నిర్వహణ. తొలి దశ పోలింగ్ - నవంబర్ 12, రెండో విడత పోలింగ్- నవంబర్ 20. మొదటి దశలో 18 స్థానాలకు, రెండో దశలో 72స్థానాలకు ఎన్నికలు.
    4:24 PM, 6 Oct

    ప్రతి పోలింగ్‌కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    4:23 PM, 6 Oct

    ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.
    4:23 PM, 6 Oct

    ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్ధం చేసినట్టు చెప్పారు.
    4:23 PM, 6 Oct

    మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20లక్షలు , మిగతా మూడు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును రూ.28లక్షలు మించకూడదని నిబంధన విధించారు.
    4:09 PM, 6 Oct

    డిసెంబర్ 11నే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
    4:08 PM, 6 Oct

    దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది.
    4:05 PM, 6 Oct

    ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలు కూడా ఎన్నికలు సిద్ధమయ్యాయి.
    4:04 PM, 6 Oct

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు ఎన్నికల సంఘం షెడ్యూడ్ ప్రకటించడంతో తెరపడింది.
    3:58 PM, 6 Oct

    తమిళనాడులో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పుడే ఎన్నికలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘానికి తమిళనాడు సీఎస్ లేఖ రాశారని ఈసీ తెలిపింది.
    3:56 PM, 6 Oct

    నవంబర్ 3న కర్ణాటకలోని షిమోగా, బళ్లారి, మాండ్యాలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
    3:51 PM, 6 Oct

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్: అక్టోబర్ 16న నోటిఫికేషన్, నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 23, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24, పోలింగ్ నవంబర్ 12న
    3:50 PM, 6 Oct

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొదటి దశ: అక్టోబర్ 16న నోటిఫికేషన్ విడుదల, నామినేషిన్ల చివరి తేదీ అక్టోబర్ 23, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24, ఉపసంహరణకు గడువు అక్టోబర్ 26, నవంబర్ 12న పోలింగ్
    3:48 PM, 6 Oct

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
    3:43 PM, 6 Oct

    నవంబర్ 28న మధ్యప్రదేశ్, మిజోరాంలలో, నవంబర్ 12, నవంబర్ 20న రెండు దశల్లో ఛత్తీస్‌రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది.
    3:40 PM, 6 Oct

    తెలంగాణతోపాటు రాజస్థాన్ ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది.
    3:36 PM, 6 Oct

    డిసెంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 11న ఫలితాలు
    3:35 PM, 6 Oct

    నవంబర్ 19న నామినేషన్లకు తుది గడువు
    3:33 PM, 6 Oct

    ఒకే దశలో తెలంగాణ పోలింగ్, తెలంగాణలో నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్
    3:29 PM, 6 Oct

    ఈ రోజు నుంచే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రావత్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేస్తామని తెలిపారు.
    3:27 PM, 6 Oct

    కాగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.

    English summary
    Election Commission to announce dates of the upcoming assembly polls in a press conference on Saturday.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X