వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారణాసి లొ తేజ్ బహదూర్ నామినేషన్ తిరస్కరణ , సుప్రింకు వెళ్లనున్న మాజీ జవాన్

|
Google Oneindia TeluguNews

యూపీలో మహ ఘట్‌బంధన్ కు ఎదురుదెబ్బ తగిలింది. వారణాసిలో మోడీని దీటుగా ఎదుర్కోవాలనే ఎత్తుగడలకు ఈసీ చెక్ పెట్టింది. ఎస్పి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీఎస్‌ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను సరైన పత్రాలు లేని కారణంగా ఈసీ తిరస్కరించింది.ఈసి నిర్ణయం పై సుప్రిం కోర్టు వెళతానని చెప్పారు తెజ్ బహదూర్ యాదవ్

వారణాసిలో బెడిసి కొట్టిన ప్రతిపక్షాల వ్యూహం

వారణాసిలో బెడిసి కొట్టిన ప్రతిపక్షాల వ్యూహం

వారణాసి లోక్‌సభ స్థానం నుండి పోటి చేస్తున్న ప్రధాని మోడీ ని ఎదుర్కోనేందుకు ప్రతిపక్షాలు చేసిన వ్యుహం బెడిసికొట్టింది. మోడీపై ఎస్పి అభ్యర్థి గా ప్రకటించిన బిఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది. మే 19న వారణాసిలో ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ ప్రక్రియ గత మూడు రోజుల క్రితం పూర్తయింది.

 స్వతంత్య అభ్యర్థి నుండి ఎస్పి అభ్యర్థిగా నామినేషన్

స్వతంత్య అభ్యర్థి నుండి ఎస్పి అభ్యర్థిగా నామినేషన్

తేజ్ బహదూర్ యాదవ్ ముందుగా వారణాసిలో స్వతంత్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం జరగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనను సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మరోసారి ఆయన సమాజ్ వాది పార్టీ తరఫున నామినేషన్ వేశారు. అయితే మొదటి వేసిన నామినేషన్ కు రెండవ సారి వేసిన నామినేషన్ వేసిన పత్రాల్లో కోంత తేడా ఉండడంతో వాటిపై వివరణ అడుగుతూ ఈసి నోటిసులు జారి చేసింది.

 నామినేషన్ పత్రాల స్క్రూటిని ,పత్రాలపై ఈసీ నోటీసులు

నామినేషన్ పత్రాల స్క్రూటిని ,పత్రాలపై ఈసీ నోటీసులు

నామినేషన్లపై మంగళవారం స్క్రూటిని జరిగింది. స్క్రూటినిలో తేజ్ బహదూర్ యాదవ్ ఉద్యోగానికి సంబంధించి సరైన సమాధం లేదు. స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో తాను ఉద్యోగాన్ని ఎందుకు వీడాల్సి వచ్చిందనే అనే దానికి సమాధానం ఇస్తూ, జవాన్ల ఆహర సరఫరా పై పలు ఆరోపణలు చేసినందుకు తనను ఉద్యోగం నుండి తొలగించారని పేర్కోన్నారు. అయితే రెండవసారి సమాజ్ వాది పార్టీ తరుఫున వేసిన నామినేషన్లతో మాత్రం ఏలాంటీ సర్టిఫికెట్ ను అందించలేదు. దీంతో నామినేషన్లను స్క్రూటిని చేసిన ఈసీ తన ఉద్యోగ తొలగింపుపై నేటి వరకు (బుధవారం ) సమాధానం చెప్పాలని నోటీస్ జారి చేసింది.

 అవినీతి మరియు అవిశ్వానికి పాల్పడిన ఉద్యోగులకు పోటీ అవకాశం లేదు.

అవినీతి మరియు అవిశ్వానికి పాల్పడిన ఉద్యోగులకు పోటీ అవకాశం లేదు.

అవినీతీ మరియు అవిశ్వాసం ద్వార ప్రభుత్వం ఉద్యోగి ఎవరైన ఉద్యోగం నుండి డిస్మిస్ అయితే వారు ఎన్నికల్లో పోటి చేయడానికి అనర్హులు అవుతారు. వారు ఉద్యోగం నుండి డిస్మిస్ అయినప్పటినుండి అయిదు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటి చేయకూడదనే నిబంధన ఉంది. ఈనేపథ్యంలోనే తేజ్ బహదూర్ యాదవ్ ఉద్యోగం నుండి అవినీతీ చేసినందుకా లేదా అవిశ్వాసం వల్లన అనేది పేర్కనలేదంటూ నోటీస్ లో పేర్కోన్నారు. దీంతో ఈసీ నోటిస్ కు ఆయన స్పందించకపోవడంతో పాటు ఈసి అడిగిన పత్రాలు సమర్పించలేదు . ఈనేపథ్యంలోనే ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్టు ఈసీ పేర్కోంది. అయితే ఈసి నిర్ణయంపై తాను సుప్రిం కోర్టుకు వెళతానని సమాజ్ వాది పార్టీ అభ్యర్థి తేజ్ బహదూర్ యాదవ్ చెప్పారు.

English summary
Election Commission has rejected ex-BSF jawan Tej Bahadur Yadav's nomination from Varanasi parliamentary constituency on Wednesday. Samajwadi Party (SP) had fielded Yadav as SP candidate from Varanasi against Prime Minister Narendra Modi for the 17th Lok Sabha Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X