కరోనా విలయం: బెంగాల్ ప్రచారానికి ఈసీ కత్తెర -రాత్రి 7వరకే అనుమతి -పోలింగ్‌కు 72 గంటల ముందే నిలిపేయాలి
మిగతా రాష్ట్రాల్లాగే ఎన్నికల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లోనూ కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగాల్ లో తదుపరి దశల ఎన్నికల ప్రచారంపై కొత్త నిబంధనలు విధించింది. రాత్రి 7 గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉంటుందని, పోలింగ్ కు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుందని సవరించిన ఆదేశాలను జారీ చేసింది. ఇంతకు ముందు ప్రచార సమాప్తికి గడవు 48 గంటలు (2 రోజులు)కాగా, ఇప్పుడు దానిని 72 గంటలకు(మూడు రోజులకు) పెంచారు.
మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తికాగా, శనివారం(ఈనెల 17న) ఐదో దశ పోలింగ్ జరుగనుంది. ఆ తర్వాత ఈనెల 29 వరకు మరో మూడు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా ఉధృతి నేపథ్యంలో చివరి మూడు దశల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను చర్చించేందుకు బెంగాల్ ఎన్నికల ప్రధాన అధికారి శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. భేటీ అనంతరం అధికారులు కొత్త నిబంధనలను జారీ చేశారు.

ఈసీ కొత్త నిబంధనలను శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని, శనివారం నుంచి ఉదయం 10 గంటలు- సాయంత్రం 7 గంటలలోపే పార్టీలు తమ ప్రచారాలను నిర్వహించుకోవాలని, పోలింగ్ కు 72 గంటల ముందే నిలిపేయాలని, వివిధ ప్రాంతాల్లో సభల్లో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లు, నేతలు, అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించడంతోపాటు సభలో పాల్గొనే అందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడేలా, భౌతిక దూరం పాటించేలా నేతలే బాధ్యత వహించాలని ఈసీ నిబంధనల్లో పేర్కొంది. వీటిని ఉల్లంఘించిన నేతలు, పార్టీలపై చర్యలుంటాయని హెచ్చరించింది. కాగా,
ఈసీ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో టీఎంసీ, బీజేపీలు భిన్నవాదనలు వినిపించాయి. మిగిలిన మూడు దశల ఎన్నికలను ఏకం చేసి, ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలని టీఎంసీ కోరింది. అందుకు ఈసీ నో చెప్పింది. బెంగాల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఈసీ మరింత శ్రద్ధ వహించాలని బీజేపీ సూచించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications