దేవభూమిలో ఓటర్లు ఎవరి వైపు - మోగిన ఎన్నికల నగారా : ధీమాతో ముందుకు..!!

అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో భాగంగా.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ విడుదలైంది. 70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ ప్రస్తుత శాసన సభ కాలపరిమితి ఈ ఏడాది మార్చి 23తో ముగియనుంది. తాజాగా ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఇతర రాష్ట్రాలతో పాటుగా ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జవనరి 21న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

జనవరి 31 నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు. 2017 ఎన్నికల్లో మొత్తం 70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 57 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో హరీష రావత్ రెండు సీట్ల నుంచి పోటీ చేసి ఒక సీట్లో ఓడిపోయారు. 2017 నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. త్రివేంద్ర సింగ్ రావత్ ను పదవి నుంచి తప్పించి , ఆ స్థానంలో మార్చి 10, 2021న తీర్ధ సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ECI Announced the dates for assembly elections in Uttarakhand, The main contenders is bjp and congress

2017 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 11 సీట్లను గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఈ సారి ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆప్ పార్టీ సైతం బరిలో ఉంది. ఇప్పటికే ప్రచారంలో నిలిచింది. ఇక, ఈ రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ముందుగానే ప్రధాని అనేక డెవలప్ మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ గెలుపు పైన రెండు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+