మే 2న కౌంటింగ్ పై ఈసీ నజర్, విజయోత్సవ ర్యాలీలపై బ్యాన్ : ఈసీఐ కీలక నిర్ణయం అందుకే !!

దేశంలోనాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై, ఫలితాల అనంతరం జరిగే గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ఊరేగింపులపై కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఊరేగింపులు నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటన జారీ చేసింది.

భారీ ర్యాలీలపై నిషేధం విధిస్తూ సమగ్ర ఉత్తర్వులను జారీ చెయ్యనున్న ఎన్నికల కమీషన్

భారీ ర్యాలీలపై నిషేధం విధిస్తూ సమగ్ర ఉత్తర్వులను జారీ చెయ్యనున్న ఎన్నికల కమీషన్

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల అనంతరం కొనసాగే భారీ ర్యాలీలపై నిషేధం విధిస్తూ సమగ్ర ఉత్తర్వులను ఎన్నికల సంఘం త్వరలోజారీ చేయనుంది. గత కొన్ని రోజులుగా రోజూ 2 వేలకు పైగా ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కోవిడ్ -19 యొక్క ఉదృతంగా ఉన్న రెండవ దశ ప్రభావంతో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది.

కరోనా ఉధృతి నేపధ్యంలో కఠిన నియమాలు

కరోనా ఉధృతి నేపధ్యంలో కఠిన నియమాలు

శాసనసభ ఎన్నికలు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, మరియు పుదుచ్చేరిలో ఎనిమిది దశల్లో షెడ్యూల్ కాగా , మార్చి 27 నుండి ఏప్రిల్ 29 తో ఎన్నికలు ముగుస్తాయి .మే 2 న కౌంటింగ్ జరగనుంది . కౌంటింగ్ సెంటర్ లోకి విజేతలైన అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది అనుమతించబడరు. కరోనా ప్రోటోకాల్స్ తో వారు సంబంధిత రిటర్నింగ్ అధికారి నుండి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని అందుకుంటారు అని ఎన్నికల కమిషన్ తెలిపింది.

నిన్న ఎన్నికల కమీషన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

నిన్న ఎన్నికల కమీషన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాప్తి చెందడానికి ఎన్నికల కమీషనే కారణమని నిన్న మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఎన్నికల అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కనీస లెక్కింపు సందర్భంగా అయినా కరోనా నిబంధనలను పక్కాగా పాటించేలా ప్రణాళికలు రూపొందించాలని, లేకపోతే కౌంటింగ్ నిలిపివేస్తామని కోర్టు హెచ్చరించింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా కౌంటింగ్ కు సంబంధించి కరోనా నియంత్రణకు ప్రణాళికలు రూపొందించడమే కాకుండా, ఆ తర్వాత జరిగే విజయోత్సవ ర్యాలీ లపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా ఎఫెక్ట్ .. పశ్చిమ బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు మరియు వాహన ర్యాలీలు ఇప్పటికే బ్యాన్

కరోనా ఎఫెక్ట్ .. పశ్చిమ బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు మరియు వాహన ర్యాలీలు ఇప్పటికే బ్యాన్

భారతదేశం మంగళవారం 3.23 లక్షలకు పైగా తాజా కోవిడ్ -19 కేసులను నమోదు చేయగా, సోమవారం ప్రపంచంలోనే అత్యధికంగా 3.5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 2,771 మంది మరణించారు. ఇక తాజా పరిస్థితుల్లో దేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. గత వారం, ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు మరియు వాహన ర్యాలీలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిషేధించింది.

బెంగాల్ లో చివరి రౌండ్ పోలింగ్ ఏప్రిల్ 29 న, ఆపై మే 2 న ఫలితాలు

బెంగాల్ లో చివరి రౌండ్ పోలింగ్ ఏప్రిల్ 29 న, ఆపై మే 2 న ఫలితాలు

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 8 దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి, ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్‌లో అన్ని భౌతిక ప్రచారాలను పరిమితం చేయాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిన్న ఏడవ దశ ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. చివరి రౌండ్ పోలింగ్ ఏప్రిల్ 29 న జరగనుంది. ఆపై మే రెండవ తేదీన కౌంటింగ్ కొనసాగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కరోనావ్యాప్తి కారణంగా ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+