జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక..21వ తేదీన కౌంటింగ్

భారత ప్రథమ పౌరుడు.. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించ ఇవాళ ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయనుంది. న్యూఢిల్లీలో గల విజయ్ భవన్‌ హాల్ నెంబర్ 5లో మధ్యాహ్నాం 3 గంటలకు ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఐదేళ్ల క్రితం 2017లో రాష్ట్రపతి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. జూలై 17వ తేదీన జరగగా.. జూలై 20వ తేదీన ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింత్ పదవీకాలం జూలై 24వ తేదీతో ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల 62 ప్రకారం కొత్త రాష్ట్రపతి.. పదవీకాలం ముగిసే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్నా ముందే పదవీ చేపట్టాల్సి ఉంటుంది. ఆ మేరకు ఈసీ ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఈ సారి కూడా ప్రక్రియ అలా జరగనుంది.

ECI To Announce Schedule For President of india Election Today

పార్లమెంట్‌లోని లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ఎలక్టొరల్ కాలేజీగా పరిగణిస్తారు. అలాగే రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే రాజ్యసభకు, లోక్ సభకు నామినేట్ అయిన సభ్యులు.. రాష్ట్రాల అసెంబ్లీలకు నామినేట్ అయిన వారు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఉండదు. అలాగే వివిధ రాష్ట్రాల్లో గల విధాన పరిషత్.. ఎమ్మెల్సీలు కూడా ఓటు వేసేందుకు ఛాన్స్ ఉండదు.

సాధారణంగా అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. ఇదివరకు రామ్ నాథ్ కోవింద్.. ఎస్సీ క్యాటగిరీలో అవకాశం లభించింది. మరీ ఈ సారి ఎవరో ఇంకా తెలియలేదు. కానీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతరుల పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన చేయలేదు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేస్తామని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు. జూన్ 15 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అవుతుంద‌ని చెప్పారు. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని తెలిపారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+