డార్క్ చాక్లెట్ గణపతి.. 200 కిలోలు.. 10 రోజుల శ్రమ.. ఎక్కడ అంటే
వినాయక చవితి.. భారీ విగ్రహాలు, రంగులతో ఉండి కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. దీంతో పర్యావరణ రహిత విగ్రహాలనే పూజించాలని ప్రతీ ఏటా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా గణనాథుడిని పూజిస్తున్నారు కూడా. ఒకరు కూరగాయాలు.. మరొకరు శంఖం.. వివిధ రకాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో కూడా క్రియేటివిటీ కనబరుస్తున్నారు.

డిఫరెంట్..
వినాయక చవితికి విభిన్న రూపాల్లో గణేశుడి ప్రతిమలను ప్రతిష్టించడం చూస్తూనే ఉన్నాం. మిగిలిన వినాయకుల కంటే కూడా తమ గణనాథుడు ఆకర్షణీయంగా కనిపించాలని విభిన్న రీతుల్లో అలంకరిస్తుంటారు. డాక్టర్, రైతు, జవాన్, పోలీస్.. ఇలా విభిన్న రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలను భక్తులు మండపాల్లో ప్రతిష్టించి పూజిస్తుంటారు. మరికొందరైతే పండ్లు, పూలు, ఇతర ఆహార పదార్థాలతోనూ వినాయకుడిని తయారు చేస్తుంటారు. ఇలాంటి విభిన్న గణపతులను చూసేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు.

డార్క్ చాక్లెట్
తమ వినాయకుడు ఆకర్షణీయంగ కనిపించాలని కొంతమంది భక్తులు డార్క్ చాక్లెట్‌తో గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. పంజాబ్‌లోని లూథియానాలో ఏర్పాటు చేసిన ఈ డార్క్ చాక్లెట్ గణపతికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత ఆరేళ్లుగా చాక్లెట్‌తోనే వినాయకుడి ప్రతిమను తయారు చేసి పూజిస్తున్నామని లూథియానాలోని ఒక బేకరీ యజమాని హర్జీందర్ సింగ్ కుక్రేజా తెలిపాడు. పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు.
200 కిలోల చాక్లెట్
చాక్లెట్ వినాయకుడిని 200 కిలోల డార్క్ చాక్లెట్‌తో తయారు చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం 10 మంది చెఫ్‌లు 10 రోజుల పాటు శ్రమించారని చెప్పారు. ఈ విగ్రహాన్ని పాలల్లో నిమజ్జనం చేస్తామని.. ఆ తర్వాత పిల్లలకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని వివరించారు. అలా పిల్లలు చాక్లెట్ వినాయకుడి ప్రసాదం ఆరగించనున్నారు. ప్రతీ ఏటా రూపొందిస్తామని వారు చెబుతున్నారు.

అందంగా ప్రతిమ
ఆ గణనాథుడి ప్రతిమను చాక్లెట్ రూపంలో తయారు చేయడం విశేషం. తమ భక్తిని పిల్లలకు ఇష్టమైన చాక్లెట్‌తో తయారు చేశారు. ఆ ప్రతిమను చూసేందుకు జనం భారీగా ఎగబడుతున్నారు. చాక్లెట్ గణపతిగా మరింత అందంగా ఉందని పిల్లలే కాదు పెద్దలు కూడా అంటున్నారు. మనసులో భక్తి భావంతో ఆ వినాయకుడిని కోలుస్తున్నామని స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications