మాల్యాకు ఈడీ బిగ్ షాక్.. ఆరువేల కోట్లు జప్తు

న్యూఢిల్లీ : వేలకోట్ల రూపాయల ఎగవేతకు పాల్పడి బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఈడీ దెబ్బ పడింది. బెంగళూరు, ముంబై సహా ఇతర ప్రాంతాల్లోని మాల్యాకు చెందిన రూ.6,630 కోట్ల ఆస్తులను ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంది.

2010లో మాల్యాపై నమోదైన 4200కోట్ల రుణ ఎగవేతకు సంబంధించిన కేసులో.. తాజాగా ఈ ఆస్తులను జప్తు చేసింది ఈడీ. మహారాష్ట్రలో ఉన్న 200కోట్ల విలువ చేసే ఫామ్ హౌజ్, బెంగుళూరులో 800 కోట్ల విలువ చేసే మాల్, అలాగే.. యూబిఎల్, యూబిఎస్ కు సంబంధించిన 3వేల కోట్ల షేర్లు తాజా జప్తులో ఈడీ జతచేసింది. గతంలోను మాల్యాకు సంబంధించిన 1400కోట్లను ఈడీ జప్తు చేసిందని, తాజాగా ఇంత భారీగా ఆస్తుల జప్తు చేయడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

ED attaches Vijay Mallya's properties and shares worth Rs 6,600 crore

కాగా, దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్న మాల్యా.. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో మాల్యాపై కేసు నమోదవగా.. కేసు విచారణలో ఉండగానే మాల్యా దేశం విడిచి లండన్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే ఆశ్రయం పొందుతోన్న మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి ఈడీ అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+