యువీ, ఊర్వశి, సోనూ సూద్‌లకు ఈడీ బిగ్ షాక్.. కోట్ల ఆస్తులు జప్తు!

Betting App Case: ప్రముఖ సెలబ్రిటీలపీ ఈడీ మరోసారి తన ఉక్కుపాదం మోపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBetకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతో పాటు బాలీవుడ్ నటులు సోనూ సూద్, ఊర్వశి రౌతేలాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ (జప్తు) చేసింది.

ఎన్ని కోట్ల ఆస్తులు జప్తు అయ్యాయంటే?
ఈ కేసులో ఈడా తాజా దర్యాప్తులో భాగంగా సుమారు 7.93 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ జప్తు చేసిన ఆస్తులలో పలువురు ప్రముఖుల ఆస్తులు ఉన్నాయి. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలాకు చెందిన రూ.2.02 కోట్ల విలువైన ఆస్తులు కూడా. ఈ ఆస్తులు ఆమె తల్లిపేరు మేద రిజిస్టర్ అయి ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో రాబిన్ ఉతప్ప (రూ.8.26 లక్షలు), సోనూ సూద్ (రూ.1 కోటి), నేహా శర్మ (రూ.1.26 కోట్లు), మిమీ చక్రవర్తి (రూ.59 లక్షలు), అంకుష్ హజ్రా (రూ.47.20 లక్షలు) లు కూడా ఉన్నారు.

ED Big Shock to Celebrities Assets Worth Rs 7 93 Crore Seized in 1xBet Betting App Case

అసలేమిటి ఈ 1xBet కేసు?
1xBet అనేది ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్. ఇండియాలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ సంస్థ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలను సాగిస్తోందని ఈడీ గుర్తించింది. ఈ యాప్ ద్వారా భారీ స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా, మనీలాండరింగ్ (అక్రమ నగదు చలామణి) జరుగుతోందని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ యాప్ ప్రమోషన్స్ లేదా ఇతర వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ సెలబ్రిటీలు పొందిన నగదును అక్రమంగా భావించి, ఈడీ వాటిని అటాచ్ చేస్తోంది.

గతంలోనూ ప్రముఖులపై చర్యలు
ఈ 1xBet కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే పలువురు క్రికెటర్ల ఆస్తులను జప్తు చేశారు. గతంలో ప్రముఖ క్రికెటర్లు శిఖర్ ధావన్‌కు చెందిన రూ. 4.55 కోట్ల ఆస్తులు,సురేష్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇప్పటివరకు ఈ ఒక్క కేసులోనే ఈడీ మొత్తం రూ.19.07 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు ఈ చర్య ఒక హెచ్చరికగా మారింది. గ్లోబల్ బుకీగా చెప్పుకుంటున్న 1xBet సంస్థ వెనుక ఉన్న ఆర్థిక మూలాలను వెలికితీసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+