Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిదంబరం, కార్తీ, సీఏపై ఈడీ ఈ-చార్జీషీట్, మనీ ల్యాండరింగ్ కేసులో పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ ఈ ఫైల్..

ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. కోర్టు కేసులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున పాస్‌వర్డ్ కలిగిన ఈ-చార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో మాజీకేంద్రమంత్రి చిదంబరం, అతని కుమారుడు కార్తీ, కార్తీ సీఏ ఎస్ఎస్ భాస్కరన్ తదితరుల పేర్లను నమోదు చేశారు.

వైరస్ తీవ్రత తగ్గాక.. సాధారణ చార్జీషీట్ దాఖలు చేయాలని ఈడీనీ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ ఆదేశించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో ఫారిన్ ఇన్వెస్టెమెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ 2007లో రూ.305 కోట్లు జమయ్యాయి. ఈ నగదు అక్రమంగా లావాదేవీ అని, అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ప్రోద్బలంతోనే జరిగిందని సీబీఐ అంటోంది. దీనిపై 2017 మే 15వ తేదీన కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.

ED Chargesheet filed against Chidambaram, son Karti in INX Media case

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గతేడాది ఆగస్ట్ 21వ తేదీన చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన కేసులో ఈడీ అక్టోబర్ 16వ తేదీన అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో చిదంబరానికి అక్టోబర్ 22వ తేదీన బెయిల్ రాగా... డిసెంబర్ 4వ తేదీన ఈడీ ఫైల్ కేసిన కేసులో బెయిల్ వచ్చింది. అప్పటినుంచి చిదంబరం బయటే ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఈ పైలింగ్ ద్వారా చార్జీషీట్ ఫైల్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+