వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం-హవాలా లింకులు-సోనియా,రాహుల్ చుట్టూ ఉచ్చు !

|
Google Oneindia TeluguNews

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాల్ని అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ కేసుకూ హవాలాతో ఉన్న లింకులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ థర్డ్ పార్టీ, నేషనల్ హెరాల్డ్‌తో సంబంధం ఉన్న సంస్థల మధ్య హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియన్ ప్రాంగణంలో సోదాలు పూర్తి చేసిన తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఈ ఆధారాలు తెలుసుకుంది. సోదాల సమయంలో ముంబై, కోల్‌కతాలోని హవాలా ఆపరేటర్ల నుండి హవాలా లావాదేవీలను ప్రతిబింబించే డాక్యుమెంటరీ సాక్ష్యాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాంగ్మూలాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ పరిశీలిస్తోంది.

ed found hawala link in national herald case, re-examining sonia and rahul statements

అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్‌కి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలన్నీ మోతీ లాల్ వోరా ద్వారానే జరిగినట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన వాదనతో ఈడీ ఏకీభవించలేదు. అలాగే సెక్షన్ 25 కంపెనీ యాక్ట్ ఫర్మ్‌గా యంగ్ ఇండియన్ నుంచి తాము ఆర్ధిక ప్రయోజనాలను పొందలేదని సోనియా, రాహుల్ గాంధీల ఇచ్చిన వివరణనూ ఈడీ నమ్మలేదు. దీంతో యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్ చేసి మరిన్ని లింకులు కదిలిస్తోంది.
ఇందులో లభించిన ఆధారాలను బట్టి దీనికి హవాలా లింకులు ఉన్నట్లు ఈడీ నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
enforcement directorate is re-examining congress leaders sonia gandhi and rahul gandhi's statements in national hearald case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X