అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ కారు స్టిక్కర్, కట్నం కింద రూ. 100 కోట్లు, ఆ కారుతో ఏం చేశాడంటే ?
బెంగళూరుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ లీడర్, శాంతినగర ఎమ్మెల్యేకు అధికారిక స్టిక్కర్ ఉన్న కారును ఓ వ్యక్తి నేర కార్యకలాపాలకు ఉపయోగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. బెంగళూరులోని శాంతినగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్‌ఎ హారిస్, ఆయన కుమారుడు కర్ణాటక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహ్మద్ హారిస్ నలపాడ్ లపై ఈడీ అధికారులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు ఇప్పుడు ఈడీ కేసుల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎన్‌ఎ హారిస్ కు సంబంధించిన అధికారిక ప్రోటోకాల్ స్టిక్కర్ ఉన్న కారును ఉపయోగించి నిందితుడు మోసం చేసినట్లు ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు.

ఇటీవల జరిగిన ఈడీ దాడుల్లో బెంగళూరు ఎమ్మెల్యే ఎన్ఎ. హ్యారిస్ పేరు మీద ఉన్న ప్రభుత్వం జారీ చేసిన స్టిక్కర్‌తో కూడిన కారును కొచ్చికి చెందిన నిందితులు ఉపయోగించినట్లు ఈడీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమాచారం ఇచ్చింది. కర్ణాటక శాసనసభ ప్రోటోకాల్ విభాగం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అధికారిక స్టిక్కర్‌ను జారీ చేసిందని, ఇదే స్టిక్కర్ ఉన్న కారును ఓ నేరస్తులు ఉపయోగించి దానిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఈడీ అధికారులు తెలిపారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ప్రకారం బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే హారిస్ కారును ఆయన కుమారుడు, కర్ణాటక యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ హారిస్ నలపాడ్ కొనుగోలు చేశారు. అయితే ఆ కారు ఎమ్మెల్యే సమీప బంధువు, ఆయన రాజకీయ సహాయకుడు నఫీహ్ మహ్మద్ నాసీర్ పేరిట రిజిస్టర్ అయినట్లు సమాచారం. అదే నెల మార్చి 14, 15, 16వ తేదీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేరళలోని కొచ్చి జోన్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కొచ్చి నివాసి ముహమ్మద్ హఫీజ్‌తో పాటు మరికొందరిపై కర్ణాటక, కేరళ, గోవాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశారు.

అక్రమ నగదు బదిలీకి సంబంధించి అవసరమైన పత్రాలను తారుమారు చేశాడని ఆరోపిస్తూ కొన్ని పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నగదు బదిలీ, నగదు దుర్వినియోగం, ఫోర్జరీ పత్రాలను సృష్టించడం, మోసం చేశాడని కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి కొచ్చికి చెందిన నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద కర్ణాటక, కేరళ, గోవా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.ఈ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడు హఫీజ్, అతని సహచరుల పేర్లు ఉన్నాయి. హఫీజ్ తన అత్తమామల నుంచి రూ.108.73 కోట్ల కట్నం తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
బంగారు ఆభరణాలు, నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ఈ దాడిలో మొత్తం 1, 672.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12. 5 లక్షల నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, వివిధ నేర కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, నిందితులకు చెందిన రూ. 4.4 కోట్ల విలువైన బ్యాంక్ బ్యాలెన్స్‌లు/ఫిక్స్‌డ్ డిపాజిట్లను సీజ్ చేయాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications