అధికార పార్టీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన అధికారులు, రిక్రూట్ మెంట్ లో అవకతవలు, మ్యాటర్ !
అధికార పార్టీకి చుక్కలు చూపించిన ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు పలు ఉచిత పథకాలు ఎర చూపి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి అచ్చి ఆరు నెలలు పూర్తి అయిన సంతోషంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు కేంద్ర ప్రభుత్వ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతి సొమ్మును సంపాధిస్తున్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా మలూరులో ఈడీ అధికారులు సోమవారం అవినీతిపరుల తలుపులు తట్టారు. మాలూరు ఎమ్మెల్యే కేవై నంజేగౌడ ఇంటిపై సోమవారం ఈడీ దాడులు చేసింది. కోలార్-చిక్కబళ్లాపూర్ జిల్లాల మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంజేగౌడ ఇంటిపై ఈరోజు తెల్లవారుజామున ఈడీ అధికారులు దాడులు చేశారు.

కోలారు జిల్లా మలూరు తాలూకా కొమ్మనహళ్లిలోని నంజేగౌడ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కోలారు తాలూకా హుత్తూరు సమీపంలోని ప్రాంతంలో ఎమ్మెల్యే నంజేగౌడకు చెందిన భవనంలో ఈడీ అధికారుు పలుపత్రాల పరిశీలిస్తున్నారు. ఇటీవల కోచిముల్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కొమ్మనహళ్లి నంజుండేశ్వర్ స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీలో పత్రాల పరిశీలన జరుగుతోంది.
కోచిముల్ రిక్రూట్‌మెంట్ విషయంలో ఎమ్మెల్యే నంజేగౌడ, ఆయన వర్గీయులు లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారుల దాడి జరిగినట్లు కన్నడ మీడియా సమాచారం. ఇచ్చింది. అయితే ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంజేగౌడ ఇంత వరకు స్పందించలేదు. మాలురు ఎమ్మెల్యే నంజేగౌడ బంధువులు, సన్నిహితుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారని వార్తలు వచ్చినా అధికారాలు మాత్రం ఆ విషయంలో ఎలాంటి ప్రకటనలు చెయ్యలేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications