ముగిసిన రాహుల్ విచారణ-ఈడీ ప్రశ్నల వర్షం-సమాధానాలపై అధికారుల సంతృప్తి
దశాబ్దాల నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఇవాళ ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ గాంధీని పిలిపించిన అధికారులు..దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే రాహుల్ ఇందుకు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.
ఉదయం 11 గంటల సమయంలో కాంగ్రెస్ శ్రేణులు, సీఎంలతో కలిసి ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లిన రాహుల్ గాంధీని మధ్యాహ్నం రెండు గంటల వరకూ విచారించినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ సంస్ధలో షేర్లు ఎందుకున్నాయని ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే నేషనల్ హెరాల్డ్ లో కాంగ్రెస్ పార్టీ పాత్రకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే వీటిని రాహుల్ నేరుగా సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. దీనిపై ఈడీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు.

రాహుల్ గాంధీపై ఈడీ విచారణ చేయడాన్ని ఆయన బావ రాబర్ట్ వాద్రా తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీని చూసి కేంద్రం భయపడుతోందని, అందుకే దర్యాప్తు సంస్ధల్ని ఆయనపైకి ఉసిగొల్పుతోందన్నారు. ఇలాంటివి గతంలో బెంగాల్, పంజాబ్ లో చూశామని, ఇప్పుడు రాహుల్ గాంధీపై జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దూకుడు చూసి కేంద్రంలో బీజేపీ భయపడుతోందని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. అటు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మాత్రం రాహుల్ గాంధీ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయన్ను విదేశాలకు పంపేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications