బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IMA Scam: మాజీ మంత్రులకు ఈడీ షాక్, వేల కోట్ల స్కామ్, బొమ్మయ్ దెబ్బతో బొమ్మ పడింది, క్లైమాక్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని శివాజీనగర కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు ఈడీ అధికారులు గురువారం సినిమా చూపించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం దెబ్బతో ఇద్దరు ప్రముఖ నాయకులకు బొమ్మ పడింది. వేల కోట్ల రూపాయల IMA స్కామ్ కేసులో రూ. 400 కోట్లు నొక్కేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

రోషన్ బేగ్ ఇంటిలో ఈడీ అధికారులు విలువైన పత్రాలు, డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇదే సమయంలో కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని చామరాజపేట కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంగళూరుతో పాటు కర్ణాటకను కుదిపేసిన రూ. 4 వేల కోట్లకు పైగా జరిగిన ఐఏంఏ స్కామ్ కేసును సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలోనే మాజీ మంత్రి రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను జైలుకు పంపించారు.

Pizza girl: పిజ్జా గర్ల్ మీద మేనేజర్ కన్ను, వేరే ప్రియుడు ఉన్నాడని, ఏం చేశాడంటే, వీడియో వైరల్ !Pizza girl: పిజ్జా గర్ల్ మీద మేనేజర్ కన్ను, వేరే ప్రియుడు ఉన్నాడని, ఏం చేశాడంటే, వీడియో వైరల్ !

 గురువారం గుట్టుచప్పుడు కాకుండా షాక్

గురువారం గుట్టుచప్పుడు కాకుండా షాక్

బెంగళూరు నగరంలోని మాజీ మంత్రి రోషన్ బేగ్ నివాసంలోకి గురువారం గుట్టుచప్పుడు కాకుండా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని శివాజీనగర కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు ఈడీ అధికారులు సినిమా చూపించారు. వేల కోట్ల రూపాయల IMA స్కామ్ కేసులో రూ. 400 కోట్లు నొక్కేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 ఆస్తులు అటాచ్ చెయ్యాలని ఆలోచన

ఆస్తులు అటాచ్ చెయ్యాలని ఆలోచన

రోషన్ బేగ్ ఇంటిలో ఈడీ అధికారులు విలువైన పత్రాలు, డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఐఏంఏ స్కామ్ కేసులో మాజీ మంత్రి రోషన్ బేగ్ ఆస్తులు అటాచ్ చెయ్యాలని గతంలోనే అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు. ఇదే విషయంలో మాజీ మంత్రి రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం కలకలం రేపింది.

 గతంలో జైలుకు వెళ్లిన రోషన్ బేగ్

గతంలో జైలుకు వెళ్లిన రోషన్ బేగ్

బెంగళూరులో రోషన్ బేగ్ ను 2020 నవంబర్ 23వ తేదీ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కోరమంగలలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు రోషన్ బేగ్ ను హాజరుపరిచారు. రోషన్ బేగ్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో అప్పట్లో రోషన్ బేగ్ ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. అదే జైల్లో ఐఎంఏ స్కామ్ ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఐఎంఏ స్కామ్ లో అప్పట్లో మన్సూర్ ఆలీ ఖాన్, రోషన్ బేగ్ ఒకే జైల్లో ఉన్నా వారిద్దరూ మాట్లాడుకోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

 కాంగ్రెస్ ఎమ్మెల్యేకి షాక్

కాంగ్రెస్ ఎమ్మెల్యేకి షాక్

కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. గురువారం బెంగళూరులోని శివాజీనగర సమీపంలోని కంటోన్మెంట్ ఏరియాలోని జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసంలో, బెంగళూరులోని చామరాజపేటలోని ఆయన సొంత ట్రావెల్స్ అయిన నేషనల్ ట్రావెల్స్ కార్యాలయంలో, జమీర్ ఖాన్ కు చెందిన అపార్ట్ మెంట్స్ లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 ఒకేసారి బంపర్ ఆఫర్

ఒకేసారి బంపర్ ఆఫర్

కర్ణాటక మాజీ మంత్రులు, కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు రోషన్ బేగ్, జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం కలకలం రేపింది. ఐఏంఏ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన రోషన్ బేగ్, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఈడీ అధికారుల దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సమాచారం.

రూ. 400 కోట్లు నొక్కేశాడు

రూ. 400 కోట్లు నొక్కేశాడు

ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీఖాన్ తాను మాజీ మంత్రి రోషన్ బేగ్ కు రూ. 400 కోట్లు ఇచ్చానని, డబ్బులు తిరిగి ఇవ్వమంటే రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని రోషన్ బేగ్ మీద గత ఏడాది సంచలన ఆరోపణలు చేశాడు .ఇదే కేసులో గత ఏడాది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోసన్ బేగ్ కు 2020 నవంబర్ 23వ తేదీన సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. బెంగళూరులో రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అప్పట్లో ఆయన్ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు.

 దుబాయ్ లో దెబ్బ కొడితే బెంగళూరులో దిమ్మతిరిగింది

దుబాయ్ లో దెబ్బ కొడితే బెంగళూరులో దిమ్మతిరిగింది

ఐఎంఏ వ్యవస్థాపకుడు బెంగళూరుతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు కుచ్చుటోపి పెట్టి 2019లో దుబాయ్ పారిపోయాడు. 2019 జూన్ 6వ తేదీన మన్సూర్ ఆలీఖాన్ దుబాయ్ నుంచి అప్పటి బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు ఓ వీడియో పంపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పిస్తే భారత్ వచ్చి లొంగిపోతానని మన్సూర్ ఆలీఖాన్ మనవి చేశాడు. దుబాయ్ లో మన్సూర్ ఆలీ ఖాన్ కొట్టిన దెబ్బకు అప్పట్లో బెంగళూరులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ దిమ్మతిరిగిపోయింది.

 ఎస్ఐటీ నుంచి IMA స్కామ్ కేసు సీబీఐ చేతికి !

ఎస్ఐటీ నుంచి IMA స్కామ్ కేసు సీబీఐ చేతికి !

కర్ణాటకలో అప్పటి కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఐఎంఏ స్కామ్ కేసు విచారణకు ప్రత్యేకంగా ఎస్ఐటీని నియమించింది. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి బీఎస్. యడియూరప్ప సీఎం అయిన తరువాత ఐఎంఏ కేసును సీబీఐకి అప్పగించారు. 2019 నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు సీబీఐ అధికారులు ఐఎంఏ స్కామ్ కేసు విచారణ చేస్తూనే ఉన్నారు.

 బీజేపీలో చేరాలని రోషన్ బేగ్ స్కెచ్...... ఆర్ఎస్ఎస్ దెబ్బతో ?

బీజేపీలో చేరాలని రోషన్ బేగ్ స్కెచ్...... ఆర్ఎస్ఎస్ దెబ్బతో ?

రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోషన్ బేగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే బీజేపీలో చేరడానికి విఫలయత్నం చేశాడు. అయితే ఐఎంఏ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ ను బీజేపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో బీజేపీ పెద్దలు వెనకడుగు వేశారు. అయితే రోషన్ బేగ్ తో పాటు అప్పటి సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన నాయకులు అందరూ ఇప్పుడు మంత్రులు అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తరువాత రోషన్ బేగ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ బహిష్కరించడం, బీజేపీ ఆదుకోకపోవడంతో రోషన్ బేగ్ ఎటూకాకుండా పోయి చివరికి జైలుపాలైనాడు. ఇప్పుడు ఈడీ అధికారుల దెబ్బతో ఆయన ఆస్తులు మొత్తం ఏమౌతాయో వేచి చూడాలి అంటున్నారు ఆయన ప్రత్యర్థులు.

English summary
IMA Scam: ED raids Karnataka former ministers R Roshan Baig and Congress party MLA Zameer Ahmed’s house in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X