సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల ఎఫెక్ట్: ఉద్దవ్ థాక్రే దూరం, కీలక భేటీలో కొత్త తీర్మానం

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర నేతలు రాహుల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తాము మిత్రపక్షంగా కొనసాగాలనుకుంటే రాహుల్ గాంధీ.. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సహా 17 పార్టీల ప్రతినిధులు హాజరైన వ్యూహాత్మక సమావేశంలో కీలక చర్చ జరిగింది.

సావర్కర్ లాంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుంటే మంచిదని తీర్మానించారు. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన డిన్నర్ మీట్‌కు ఉద్ధవ్ థాక్రే గైర్హాజరవడం గమనార్హం. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ఉద్ధవ్ నిర్ణయించారు.

Effect of Rahul comments on Savarkar: Oppositions New Resolution After Uddhav Thackeray Backs Out Of Meet.

'నా పేరు సావర్కర్ కాదు, క్షమాపణ చెప్పను' అని రాహుల్ గాంధీ ఇటీవల ట్విట్టర్ వేదిగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరుపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎంపీగా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పనంటూ సావర్కర్ పేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నేతలు మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉన్న ఉద్ధవ్ థాక్రే కూడా రాహుల్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. తాము దేవుడిగా ఆరాధించే సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానకపోతే మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలో చీలిక రాక తప్పదని ఉద్ధవ్ హెచ్చరించారు. కాగా, గతంలో కూడా రాహుల్.. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రజాస్వామ్యం కోసం రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చామని.. కానీ, తాము దేవుడిగా ఆరాధించే వ్యక్తులను అవమానిస్తే ఊరుకోమన్నారు ఉద్ధవ్. ఈ క్రమంలోనే ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశంలో ఇలాంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయకపోవడమే మంచిదని సీనియర్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు.

కాంగ్రెస్‌తో పాటు, డీఎంకె సభ్యులు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్, తెలంగాణ అధికార భారత రాష్ట్ర సమితి, సిపిఎం, సిపిఐ, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఎండిఎంకె, కెసి, టిఎంసి, ఆర్‌ఎస్‌పి, ఆర్‌జెడి, ఐయూఎంఎల్, వీసీకే, ఎస్పీ, జేఎంఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. అనర్హత వేటు వేసిన క్రమంలో రాహుల్ గాంధీకి మద్దతుగా, కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+