పొరయార్‌లో కూలిన బస్ డిపో పైకప్పు: 8మంది మృతి, 20మందికి గాయాలు
Recommended Video

చెన్నై: తమిళనాడులోని పొరయార్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టీఎన్‌ఎస్‌టీసీ బస్ డిపో పైకప్పు(గ్యారేజీ) కూలి 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులతో పాటు, గాయపడినవారిలో బస్ డ్రైవర్స్, మెకానిక్స్, కండక్టర్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విధులు ముగించుకుని, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
కాగా, పురాతన భవనం కావడంతో.. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం పైకప్పు కూలిపోయి ఉంటుందని అన్నారు. ఇక మృతి చెందినవారిని మునియప్ప, చంద్రశేఖర్, ప్రభాకర్, రామలింగం, మణివన్నన్, ధనపాల్, అన్బరసన్, బాలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడినవారిలో వెంకటేశన్, సెంథిల్, ప్రేమ్‌కుమార్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
ఎంతో ఆనందంగా దీపావళి పండగ జరుపుకుని తెల్లవారేసరికి విగత జీవులుగా మారిన మృతులను చూసి వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications