బస్సు బోల్తా: సంక్రాంతికి సొంతూరు వెళ్తూ మృత్యువాత

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/ బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. కర్ణాటర రోడ్డు రవాణా సంస్థ బస్సు బోల్తా పడి రోడ్డు పక్కన ఉన్న బొందలో పడిపోయింది. దీంతో ఆ ప్రమాదం సంభవించింది.

బెంగళూరు సమీపంలోని శాంతిగ్రామ వద్ద శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది. సంక్రాంతి పర్వదినానికి స్వగ్రామానికి వెళ్తూ 8 మంది మరణించారు. బస్సు బెంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

Eight killed in bus accident in Karnataka

మృతుల్లో నలుగురిని గుర్తించారు. వారు డ్రైవర్ లక్ష్మణ్ (38), దయానా (20), గంగాధర్ (20) శివప్ప చలవాది (36), మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ఉన్నారు..

ఇదిలావుంటే, తమిళనాడులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. తమిళనాడులోని వందవాసి వద్ద కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eight persons were killed and more than 10 others injured when a bus overturned and fell into the road side ditch near Shantigrama on the outskirts of the city on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి