దారుణం: భర్త ముందే భార్యపై ఎనిమిదిమంది గ్యాంగ్ రేప్
భర్తను కట్టేసి ఎనిమిదిమంది వ్యక్తులు కదిలే వాహనంలో భార్య.పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను గుర్తించేందుకుగాను పోలీసులు
లక్నో: భర్తను కట్టేసి ఎనిమిదిమంది వ్యక్తులు కదిలే వాహనంలో భార్య.పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను గుర్తించేందుకుగాను పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు నిర్భయకేసుపై తీర్పు వచ్చిన రోజే ఈ ఘటన చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జలాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కళాకారులైన ఇద్దరు దంపతులు జైపూర్ నుండి యూపీలోని అరయకు వచ్చారు. అప్పటికే అర్ధరాత్రి అయింది. వారు అక్కడి నుండి మరో ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంది.

దీంతో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఓ ట్రక్ అటువైపుగా వచ్చింది. ట్రక్ డ్రైవర్ వారికి లిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో వారు ట్రక్ లో ఎక్కారు.
ట్రక్ కొంత దూరం వెళ్ళిన తర్వాత మద్యం దుకాణం వద్ద ట్రక్ ను ఆపాడు డ్రైవర్. ట్రక్ డ్రైవర్ తో పాటు మరో ఏడుగురు ట్రక్ లో ఎక్కారు. కదులుతున్న ట్రక్ లోనే భర్తను కట్టేసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు.
వారివద్ద ఉన్న బంగారం, డబ్బులను దోచుకొన్నారు. తమ పని పూర్తిచేసుకొన్న తర్వాత వారిని వదిలేశారు. అయితే బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నిర్భయ కేసు తీర్పు వచ్చిన రోజే వెలుగుచూసింది.












Click it and Unblock the Notifications