మరీ ఇంత ఘోరమా?: సర్పంచ్ ఇంట్లోకి వెళ్లాడని.. తన ఉమ్మిని తనచేతే నాకించి...

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సొంత జిల్లా నలందలోని అజైపూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. బుధవారం రాత్రి మహేష్ ఠాకూర్(54) అనే వృద్ధుడు సర్పంచ్ ఇంటికి వె

ముంబై: ప్రభుత్వ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు తన ఇంటి తలుపు తట్టకుండా నేరుగా ఇంట్లోకి వచ్చినందుకు ఓ సర్పంచ్‌ వికృతమైన శిక్ష విధించాడు.

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సొంత జిల్లా నలందలోని అజైపూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Elderly man in Nalanda forced to spit, lick own saliva off ground; Bihar minister condemns incident

Recommended Video

    Man forced to spit, lick saliva as punishment : Video : Bizarre Incident | Oneindia Telugu

    బుధవారం రాత్రి మహేష్ ఠాకూర్(54) అనే వృద్ధుడు సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. అతడు తన ఇంటి తలుపు తట్టకుండానే నేరుగా లోపలికి రావడంతో తీవ్ర ఆగ్రహం చెందిన సర్పంచ్ సురేంద్ర యాదవ్ గురువారం పంచాయతీ నిర్వహించాడు.

    మహేష్ ఠాకూర్ ను పిలిపించి, మొదట కొంతమంది మహిళలతో చెప్పులతో కొట్టించాడు. అంతటితో ఊరుకోకుండా సర్పంచ్‌ సురేంద్ర యాదవ్ ఆ వృద్ధుడితో నేలపై ఉమ్మించి అతడి ఉమ్మిని బలవంతంగా అతడి చేతే నాకించాడు.

    మహేష్ ఠాకూర్ పొగాకు కోసం సర్పంచ్ ఇంటికి వెళ్లాడని, లేదు.. లేదు.. అతడు ప్రభుత్వ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సర్పంచ్‌ ఇంటికి వెళ్లడంతో ఇంతటి ఘోరం జరిగిందని పలువురు పలు రకాలుగా చెప్పుకుంటున్నారు.

    ఈ అఘాయిత్యంపై విచారణ జరిపేందుకు కలెక్టర్ త్యాగరాజన్ ఒక పోలీసు అధికారిని అజైపూర్ కు పంపించారు. మరోవైపు ఈ దుశ్చర్యను మంత్రి నందకిశోర్‌ యాదవ్‌ ఖండించారు. ఈ ఘోరానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+